Weight Loss: చలి కాలంలో నల్ల మిరియాలతో బరువు తగ్గడమేకాకుండా..ఈ 4 తీవ్ర వ్యాధులకు చెక్..
Black Pepper For Weight Loss: నల్ల మిరియాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Black Pepper For Weight Loss: నల్ల మిరియాలను భారతీయులు వంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి వంటల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇందులో ఉండే గుణాలు రుచిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇవి శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా ప్రజలు జబ్బులకు వినియోగిస్తారు. వీటిని దగ్గు, జలుబు ఉన్నవారు వినియోగిస్తే సులభంగా ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నల్ల మిరియాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతాయి.
చలికాలంలో నల్ల మిరియాలు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
నల్ల మిరియాల్లో పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల చేసే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి ప్రోటీన్లు లభించే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది.
మలబద్ధకం:
మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చడమేకాకుండా ఒత్తిడి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది.
బరువు తగ్గడం:
బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీని రోజూ తాగుతూ ఉంటారు. అయితే దాని బదులుగా నల్ల మిరియాలతో చేసిన టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఫైటోన్యూట్రియెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును సులభంగా నియంత్రిస్తాయి.
కీళ్ల నొప్పులు:
చలి కాలంలో కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. అయితే తరచుగా ఈ నొప్పులతో బాధపడుతున్నవారు నల్ల మిరియాలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని వినియోగించాల్సి ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయి:
మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. అయితే చక్కెర స్థాయిలు క్రమంగా పెరిగే తప్పకుండా నల్ల మిరియాలతో తయారు చేసిన ఆహారాలును క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు
Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.