Weight Loss Fruit: మారుతున్న జీవనశైలి కారణంగా బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారింది. బరువు తగ్గడానికి ఆహార నియమాలు, వ్యాయమం తప్పకుండా అవసరమవుతోంది. అయితే చాలా మంది పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తక్కువ కాలంలో తగ్గించుకోవాలనుకుంటారు. కానీ ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోలేక పోతున్నారు. దీని కోసం కొందరు వైద్య నిపుణులు పుచ్చకాయను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే పుచ్చకాయ వల్ల కొవ్వు ఏ విధంగా నియంత్రణలోకి వస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ ప్రయోజనాలు:


-భారత్‌లో వేసవి కాలంలో పుచ్చకాయ వినియోగం చాలా పెరిగింది. దీనిని ఇష్టపడేవారుండరు. దీని వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా..శరీరంలో నీటి కొరత తొలగిస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ ప్రమాదం తగ్గుతుంది.


-USDA నివేదిక ప్రకారం.. 100 గ్రాముల పుచ్చకాయలో 30 కేలరీలు, 0 శాతం సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది. కావున  డైటరీ ఫైబర్ కూడా ఇందులో పెద్ద మొత్తంలో ఉంటుంది. కావున దీనిని నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


-పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు ఫైబర్‌గా మారుతాయి. దీని కారణంగా బరువు తగ్గడం మొదలవుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ తగ్గుతాయి.


- పుచ్చకాయ పొట్టను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల ఆకలి తగ్గిపోతుంది.


-పుచ్చకాయలో ఆమ్ల స్వభావం అధికంగా ఉంటుంది. కావున దీనిని రాత్రిపూట తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రిపూట పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ ఆలస్యం అవుతుందని వారు తెలిపారు.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!


Also Read: Pushya Nakshatra 2022 : పుష్య నక్షత్రం.. ఈరోజు పట్టిందల్లా బంగారమే ... ఇలా చేస్తే తిరుగులేని సంపద, ఐశ్వర్యం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook