Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Fennel Oil For White Hair: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులో ఈ సమస్యలు రావడం వల్ల ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో లభించే చాలా రకాల ఉత్పత్తులను వాడినా ఆశించిన ఫలితం లభించడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 02:23 PM IST
  • సోపు నూనె వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు
  • సోపులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి
  • జుట్టును బలంగా చేస్తాయి
Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Fennel Oil For White Hair: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులో ఈ సమస్యలు రావడం వల్ల ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో లభించే చాలా రకాల ఉత్పత్తులను వాడినా ఆశించిన ఫలితం లభించడం లేదు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలు పెరగడం వల్ల హెయిర్‌ డై వేసుకుంటున్నారు. ఇది హెయిర్‌ డ్యామేజ్‌ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి తెల్లజుట్టును మళ్లీ నేచురల్‌గా ఎలా నల్లగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సోపు నూనె వల్ల జుట్టుకు లాభాలు:

చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే..ఫెన్నెల్ ఆయిల్( సోపు నూనె )ను వాడమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది జుట్టు చిట్లడం సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

 సోపు నూనె ఎందుకు ప్రయోజనకరం.?

సోపులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు సమస్యలను దూరం చేసి జుట్టును బలంగా చేస్తాయి.     

సోపుతో జుట్టుకు మేలు: సోపును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఇది ఆహారాన్ని రుచిగా చేస్తుంది.

ఇంట్లో సోపు నూనెను తాయారు చేయడానికి కావాల్సి పదార్థాలు:

1. కప్పు సోపు
2. కొబ్బరి లేదా ఆలివ్ నూనె

ఈ నూనె సిద్ధం చేయడం ఎలా?

- నూనె తయారు చేయాడానికి ముందుగా ఒక పాత్రలో ఆలివ్ లేదా కొబ్బరి నూనె వేసి, దానికి సోపు గింజలను వేయాలి.
- ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడికించాలి.
- చివరగా నూనె చల్లారిన తర్వాత బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి.
- క్రమం తప్పకుండా నూనె తలకు మర్దన చేసుకోవాలి

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Neem Leaves Benefits: వేప వల్ల శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Also Read: Kashmir Killings: కాశ్మీర్‌ లోయలో 'హైబ్రీడ్' ఉగ్రవాదం..పోలీసుల విచారణలో కీలక విషయాలు..!

Trending News