Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునే వారు తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు, ఆరోగ్య నిపుణులు సూచించిన బ్రెడ్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండడమేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  బరువును నియంత్రించే ఆరోగ్యకరమైన బ్రెడ్‌లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా పలు రకాల పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆరోగ్య నిపుణులు సూచించిన బ్రెడ్‌లను కూడా ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్‌:
గోధుమ పిండితో తయారు చేసిన వైట్ బ్రెడ్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ బ్రెడ్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీట్ బ్రెడ్ అల్పాహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రెడ్‌లో టైప్ 2 డయాబెటిస్ నియంత్రించే గుణాలు కూడా ఉన్నాయి. కాబట్ట ప్రతి రోజు ఈ బ్రెడ్‌ను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్


మిల్లెట్ బ్రెడ్:
మిల్లెట్ బ్రెడ్స్‌ కూడా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటాయి. కాబట్టి ఈ బ్రెడ్‌ను ప్రతి రోజు అల్పాహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రిణలో ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు మిల్లెట్ బ్రెడ్ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి తీవ్ర బరువు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


మొలకెత్తిన ధాన్యాలతో బ్రెడ్స్‌:
మొలకెత్తిన ధాన్యాలతో బ్రెడ్స్‌ తయారు చేసుకుని తినడం వల్ల కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును నియంత్రించుకునేవారు డైట్‌లో ప్రతి రోజు మొలకెత్తిన ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం అభివృద్ధి చెందుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook