Diet Plan For Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 8 రోజుల్లో చెక్!
Diet Plan For Weight Loss In 8 Days: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా రకాల ఆహారాలున్నాయి. వాటిని ప్రతి రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Diet Plan For Weight Loss In 8 Days: అందరూ శరీరం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఆధునికి జీవన శైలిలో ఇది సాధ్యం కాదు. చాలా మంది ప్రస్తుతం అతిగా ఆహారాలు తింటున్నారు. దీని కారణంగా సులభంగా బరువు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అల్పాహారంలో అధిక పోషక పరిమాణాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి రోజు అల్పాహారంలో పోషకాలు అధిక పరిమాణంలో ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి భోజనంలో తేలిక పాటు గల ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి భోజనం నిద్రకు 3 గంటల ముందు చేయడం వల్ల కూడా సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా డిన్నర్‌లో కొన్ని పదార్థాలను తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు.
బరువు తగ్గడానికి వీటిని తినండి:
పెసర పప్పు:
పెసర పప్పులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటు నియంత్రించి బరువు కూడా సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. డిన్నర్‌లో పెసర పప్పు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఈ పప్పును తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
సబుదాన ఖిచ్డీ:
సబుదానలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సబుదానతో తయారు చేసిన ఖిచ్డీ తినడం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అయితే క్రమం తప్పకుండా డిన్నర్‌లో ఈ ఖిచ్డీ తీసుకోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
బొప్పాయి సలాడ్:
బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ వంటి పొట్ట సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ ఆహారంగా సలాడ్‌లో బొప్పాయి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సలాడ్‌లో తప్పకుండా సోయాసాస్, రైస్ వెనిగర్ వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.