Natural Tips For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు కారణం మారిన జీవన శైలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒకటే చోట ఎక్కువ సేపు కూర్చోవడం, అధిక కేలరీల ఆహారాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా దీనికి ముఖ్య కారణాలు అని అంటున్నారు. కొంతమంది ఈ సమస్య నుంచి బయటపడడానికి జిమ్ లో కష్టపడి వర్క్ అవుట్ లు, చికిత్సలు, మందులు వంటి తింటారు. కానీ ఎలాంటి లాభం ఉండదు. కానీ ఎలాంటి చికిత్సతో పని లేకుండానే సహజంగా బరువు తగ్గొచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సహజంగా బరువు తగ్గడం ఎలా?


ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాసు నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది, ఎక్కువగా ఆకలి కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ కలిగిన పదార్థాలలో గుడ్లు, పెరుగు వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఇవి  సహాయపడతాయి. 


ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇది శరీరంలో ఉండే కేలరీలు, కొవ్వును కరిగిస్తుంది. ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు స్వీట్ పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది, లేకుంటే తొందరగా బరువు పెరుగుతారు.


భోజనంలో కూడా ఎక్కువగా స్నాక్స్ ని తీసుకోవడం మంచిది కాదు సమతూల్యమైన ఆహార పదార్థాలను తినడం వల్ల ఇది మీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే పొట్ట కొవ్వును తగ్గించడానికి కూడా కొన్ని యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల  బెల్లీ ఫ్యాట్ నుంచి విముక్తి పొందుతారు. అతిగా వేయించిన నూనె పదార్థాలు, జింక్ ఫుడ్స్ ను దూరంగా ఉంచాలి లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. బయట తయారు చేసిన ఆహారం కంటే ఇంట్లోనే వండిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఎలాంటి నష్టం కలగదు. బరువు తగ్గడానికి ఇది మొదటి మార్గం. 


ఈ  చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా పాటించడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అలాగే శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంతో ముఖ్యం. కాబట్టి జీవనశైలిలో మంచి అలవాట్లను పాటించడం మంచిది. 


Also Read: Diabetes: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.