Weight Loss Plan: శనగపిండి రోటీలతో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?..
Besan Roti For Weight Loss And Anemia: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శనగపిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోండి.
Besan Roti For Weight Loss And Anemia: శనగపిండితో తయారు చేసి రోటీలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గోధుమ పిండితో తయారు చేసిన రోటీలకు బదులుగా శనగపిండితో చేసిన ఆహారాలు తినడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చుని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అన్ని రకాల దీర్ఘకాలి వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శనగపిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శనగపిండితో తయారు చేసిన రోటీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శరీర బరువు నియంత్రణలో ఉంటుంది:
శనగపిండితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తినడం వల్ల శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
రక్తహీనత:
శనగపిండి రోటీలను ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బలహీనత సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
రోగనిరోధక శక్తి:
శనగపిండి ఆహార పదార్థాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శనగపిండిలో ఉండే విటమిన్-బి, ప్రొటీన్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి