Weight Loss Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జీవన విధానం అస్తవ్యస్థంగా ఉండటం, నిద్రలేమి ఇలా వివిధ కారణాలతో బరువు పెరిగిపోతుంటారు. స్థూలకాయం సమస్యగా మారి నలుగురిలో అసౌకర్యంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. మరి ఈ సమస్యకు సులభమైన చిట్కాతో దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజురోజుకూ పెరుగుతున్న బరువు తగ్గించేందుకు కొంతమంది డైటింగ్ చేస్తుంటారు ఇంకొంతమంది వర్కవుట్స్ చేస్తుంటారు. మరి కొంతమంది వాకింగ్‌కు వెళ్తుంటారు. ఒక్కసారి ఎన్ని చేసిన సరైన ఫలితాలు కన్పించవు. ఈ పరిస్థితుల్లో వీటితో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు. అలాంటి చిట్కాల్లో ఒకటి సోంపు. సోంపు నీళ్లతో బరువు చాలా వేగంగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని విష పదార్ధాలను సోంపు నీళ్లతో తొలగించడడం ద్వారా ఇది సాధ్యమౌతుంది. 


సోంపు అనేది నిజానికి డైట్‌లో ఓ భాగమే. బహుశా అందుకే భోజనానికకి ఏ హోటల్‌కు వెళ్లినా భోజనం తరువాత వివిధ రకాల ఫ్లేవర్లలో సోంపు అందిస్తుంటారు. ఎందుకంటే సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా పోతుంది. సోంపులో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. శరీరంలోని టాక్సిన్స్ అంటే విష పదార్ధాలను సోంపు నీళ్లు తాగడం ద్వారా శరీరం నుంచి బయటకు పంపించవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా సోంపు నియంత్రిస్తుందగి. ఇదులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సహాయంతో కేలరీలను సులభంగా కరిగించవచ్చు. 


క్రమం తప్పకుండా సోంపు తిన్నా లేదా రోజూ పరగడుపున ఉదయం సోంపు నీళ్లు తాగినా మంచి ప్రయోజనాలుంటాయి. బెల్లీ ఫ్యాట్ సమస్య ఉత్పన్నం కాదు. ఒక స్పూన్ సోంపును గ్లాసు నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టాలి. చల్లారిన తరువాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజూ చేస్తే 4-5 వారాల్లో ఫలితాలు చూడవచ్చు.


స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యను ఇట్టే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే స్థూలకాయం క్రమంగా కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటుకు దారితీస్తుంది. అక్కడి నుంచి ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణం కావచ్చు. అందుకే అధిక బరువు సమస్యతో బాధపడేవాళ్లు ఇలాంటి హోమ్ రెమిడీస్ సహాయంతో బరువు నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి.


Also read: Sinus Problems: సైససైటిస్ అంటే ఏమిటి, ఎలా గుర్తించాలి, సైనస్ సమస్యకు ఏకాగ్రతకు లింక్ ఉంటుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook