Weight Loss with Mangos: వేసవిలో ఈ తియ్యని పండుతో కేవలం 12 రోజుల్లో వేగంగా బరువు తగ్గొచ్చు
Eat Mangoes For Weight Loss: ప్రస్తుతం అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు వేసవిలో లభించే మామిడి పండుతో కూడా సులభంగా వెయిట్ ను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను ఎలా తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Eat Mangoes For Weight Loss: సీజన్ వారీగా వచ్చే పండ్లను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం భారతదేశంలో వేసవి కాలం మొదలైంది అయితే ఈ క్రమంలో మామిడి పండ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది వీటిని ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే ఇవి నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభించడం వల్ల శరీరాన్ని అన్ని రకాల వ్యాధులను రక్షిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మామిడి పండ్లను ఎలా తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మ్యాంగో సలాడ్స్:
ప్రస్తుతం వేసవి కారణంగా మామిడి పండ్లు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తాయి. అంతేకాకుండా వీటితో తయారుచేసిన రకరకాల ఆహార పదార్థాలు కూడా రోడ్లపై అమ్ముతూ ఉంటారు. అయితే అధిక బరువుతో బాధపడుతున్న వారు మామిడి పండ్లతో తయారు చేసిన సలాడ్ ను తినడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ సలాడ్ ను తయారు చేయడానికి ముందుగా పండిన ఒక మామిడిపండు, ఒక చిన్న కప్పు అవిస గింజలు, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ తేనె, రుచికి సరిపడా పెప్పర్ పౌడర్, తరుముకున్న పాలకూర వీటన్నిటినీ తీసుకొని ఒక కప్పులో వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పులో తీసుకుంటే మామిడి పండు తో తయారు చేసిన సలాడ్ రెడీ అయినట్లే. ఇలా తయారు చేసిన సలాడ్ ను ఉదయం పూట తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
మ్యాంగో ఓట్స్ స్మూతీ:
మ్యాంగో ఓట్స్ స్మూతీ కూడా శరీర బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకుని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలు, ఒక పండిన మామిడిపండు అర గ్లాసు వాటర్ తీసుకుని అన్ని గ్రైండర్ బౌల్ లో మిక్స్ చేసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ ని సర్వ్ చేసుకుని తాగితే మీరు మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Also Read: Mahindra XUV400 Errors: మహీంద్రా ఎక్స్‌యూవీ400లో 3 లోపాలు.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోండి!
మామిడి ఓట్స్ మీల్:
మామిడి ఓట్స్ మీల్ తయారు చేయడానికి.. 50 గ్రాముల కొబ్బరి తురుము అరకప్పు, కొబ్బరి పాలు, 150 గ్రాముల ఓట్స్, పండిన మామిడిపండు ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్, ఒక టీ స్పూన్ తేనెను ఒక బౌల్లో ఒక బౌల్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకొని తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి