Weight Loss Tips: మనలో ఎవరైనా స్లిమ్‌గా, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఈ రోజుల్లో ముఖ సౌందర్యంతో పాటు శరీర సౌందర్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవారు తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నం తక్కువగా తినాలని అంటారు. కానీ అలా చేయడం అందరికీ కుదరని పని. అయితే అన్నం తింటూనే బరువు తగ్గే ఉపాయం ఒకటి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గేందుకు బ్రౌన్ రైస్..


బరువు తగ్గడం ముఖ్యం.. అన్నం కూడా తినలేకపోతే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం మంచిది. బ్రౌన్ రైస్ తినడం వల్ల పొట్ట కొవ్వు త్వరగా తగ్గుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ మొత్తాన్ని పెంచడం వల్ల శరీరంలోని కేలరీలు 100 కేలరీలు తగ్గుతాయి.


తెల్ల బియ్యం ఆరోగ్యానికి హానికరం!


వైట్ రైస్ తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, గోధుమలు వంటి తృణధాన్యాలు తినేవాళ్లు ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు. బ్రౌన్ రైస్ తినడం జీవక్రియ, జీర్ణక్రియకు కూడా మంచిది.


బ్రౌన్ రైస్ తినే వారు ప్రతిరోజూ దాదాపు అరగంట పాటు స్పీడ్ వాక్ చేయడం మంచిది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మీరు బ్రౌన్ రైస్, వ్యాయామాన్ని కొన్ని వారాలపాటు అనుసరిస్తే.. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది.


బ్రౌన్ రైస్‌లోని ఫైబర్, హోల్ గ్రెయిన్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీనిని తీసుకునే వ్యక్తులు గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ లేదా ట్రిపుల్ నాళాల వ్యాధి ప్రమాదానికి దూరంగా ఉంటారు.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Drinking Water: ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకోకుండా మంచినీళ్లు తాగడం మంచిదేనా...


Also Read: Amla Seeds Benefits: ఉసిరి గింజల వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook