Drinking Water After Waking Up: కొంతమంది ఉదయం నిద్ర లేవగానే మంచి నీళ్లు తాగుతారు. కొందరు బ్రష్ చేశాక కానీ నీళ్లు తాగరు. ఉదయాన్నే పాచి నోటితో నీళ్లు తాగడం మంచిదేనా... పళ్లు తోముకోకుండా నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలేమైనా వస్తాయా.. ఈ సందేహాలు చాలామందిలో ఉంటాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆరోగ్యంగా ఉండాలంటే..:
ప్రఖ్యాత డైటీషియన్ నిఖిల్ వాట్స్ ప్రకారం... ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 8 నుండి 10 గ్లాసులు లేదా రెండు లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేసవిలో అయితే రెండున్నర లీటర్ల నీరు తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మంచినీళ్లు తాగడం శరీరానికి చాలా మంచి చేస్తుందని డైటీషియన్ నిఖిల్ వాట్స్ చెబుతున్నారు.
ఉదయాన్నే నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :
తెల్లవారుజామున నిద్ర లేచిన సమయంలో... బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి నష్టం లేదని.. దీని ద్వారా శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
1. ఉదయం బ్రష్ చేసుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది.
2. బ్రష్ చేయకముందే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది.
3. ఉదయాన్నే మంచినీళ్లు తాగడం జుట్టుకు కూడా మంచిదే. దీనివల్ల మీ జుట్టు నిగనిగలాడుతుంది.
4. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. ముఖంలో మంచి గ్లో వస్తుంది.
5. మీకు మధుమేహం ఉన్నట్లయితే... ఉదయం నిద్రలేచిన వెంటనే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.
6. ఇలా ఉదయాన్నే నీటిని తాగడం వల్ల స్థూలకాయం క్రమంగా తగ్గుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read: HDFC BANK: మీకు HDFCలో అకౌంట్ ఉందా.. వెంటనే ఖాతా చెక్ చేసుకోండి.. కోట్ల రూపాయలు జమ కావొచ్చు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook