Weight loss tips in 10 days: గోధుమ పిండితో చేసిన రొట్టెను భారతీయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే వీటి రకరకాల ధాన్యాలతో తయారు చేస్తారు. ఒక్కొ రాష్ట్రం వారు ఒక్కొ ధాన్యంతో రొట్టేలను చేస్తారు. వీటిలో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు దోహదపడతాయి. ప్రస్తుతం చాలా మంది గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తింటున్నారు. అయితే ఇతర తృణధాన్యాల పిండితో చేసిన రోటీనలను తింటే అధిక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఇవి రుచిని ఇవ్వడమే కాకుండా మంచి పోషక విలువలను అందిస్తుంది. బరువు తగ్గడానికి గోధుమలకు బదులుగా ఏ తృణధాన్యాలతో రొట్టెలను తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రొట్టెలు శరీరానికి చాలా పోషకాలను ఇస్తాయి:


మిల్లెట్ రోటీ (Millet Roti):


మిల్లెట్ పిండిలో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఫ్రీ మూలకాలుంటాయి కాబట్టి ఒకసారి మిల్లెట్ రోటీని తింటే.. ఎక్కువసేపు ఆకలి అనుభూతి ఉండదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.


గోధుమ రోటీ (Barley Roti):  


గోధుమ పిండితో తయారుచేసిన రోటీని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం ఉంటుంది. జీర్ణక్రియను శక్తివంతంగా చేసేందుకు సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా గోధుమ పిండి (Barley Roti)తో చేసిన రోటిలను తినండి.


ఓట్స్ రోటీ (Oats Roti):


ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో ఓట్స్ తీసుకుంటారు. ఈ ఓట్స్‌లో రక్తంలో చక్కెరను నియంత్రించే మూలకాలున్నాయి. కావున ఇది శరీరంలో బరువును కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ఓట్స్ రోటీలుగా చేసుకుని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.


రాగి రోటీ (Ragi Roti):


 ఆయుర్వేద శాస్త్రంలో రాగుల గురించి క్లుప్తంగా వివరించారు. రాగు శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాగులను ఎప్పటి నుంచో  బరువు తగ్గించే ఆహారంగా పరిగణిస్తారు. అయితే ఈ పిండితో చేసిన రోటీలు శరీరానికి మరిన్ని ప్రయోజనాలను ఇవ్వడమే కాకుండా బరువును నియంత్రిస్తుంది.


జొన్న రోటీ (Sorghum Roti) :


జొన్న అనేక రకాల పోషక విలువలున్నాయి. కావున శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలను, విటమిన్లను లభిస్తాయి. అయితే వీటి రొట్టెల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ పిండితో చేసిన రోటీలను తినమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: Cherries For Weight Loss: ఏం చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే రోజూ వీటిని తినండి..!


Read also: Cervical Pain Treatment: ఎన్ని మందులు వాడిన మెడ నొప్పులు తగ్గడం లేదా.. అయితే ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook