Weight loss tips: అధిక బరువు తగ్గించే అద్భుతమైన Drinks
Weight loss tips, Drinks to lose weight: పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ( Lemon water) బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం (Jaggery) కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. Lemon water with jaggery and ginger flavors: ఈ జ్యూస్‌ను తయారు చేసే విధానం ఏంటంటే..
Weight loss tips, Drinks to lose weight: శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మనిషిని లావుగా తయారు చేయడమే కాకుండా అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అన్నింటికి మించి పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు అధిక బరువు పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తుంది. పొట్టలో కొవ్వును కరిగించుకుంటే.. ఆ అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.
పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ( Lemon water) బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం (Jaggery) కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గేందుకు సహకరించడమే కాకుండా పరోక్షంగా ఆరోగ్యానికి ( Health benefits of Lemon water) ఎంతో మేలు చేస్తాయి.
ఒక గ్లాసు నిమ్మకాయ రసం సేవిస్తే.. నీరసం దరిచేరదు. అందుకే మండు వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, ఉత్తేజం కలిగించే పానియంగా నిమ్మ రసం ఉపయోగపడుతుంది.
బెల్లం పంచదారకు ప్రత్యామ్నాయం. బెల్లంలో జింక్, సెలెనియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
నిమ్మరసంలో బెల్లం కలిపి సేవించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. శరీరంలో మెటాబాలిజం మెరుగుపడుతుంది.
నిమ్మరసంలో బెల్లంతో పాటు అల్లం రసం కూడా కలిపి తీసుకుంటే ఇంకొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
Lemon water with jaggery and ginger flavors: ఈ జ్యూస్‌ను తయారు చేసే విధానం ఏంటంటే..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం (Lemon juice with hot water) మిక్స్ చేయండి.
నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను చిన్నగా, సన్నగా తరిగి అందులో (Ginger with lemon water) వేయండి.
బెల్లం పొడి కలిపి ఒక ద్రవంలా కలిసేంత వరకు మిక్స్ చేయండి.
ఇంకేం.. పొట్టలోని కొవ్వును (Belly fat) తగ్గించే డ్రింక్ రెడీ.
ప్రతీ రోజూ ఉదయం ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు (Weight loss tips) కోల్పోతారు. వెయిట్ లాస్ మెథడ్స్‌లో ఇదొక సింపుల్ మెథడ్.