Drinks to lose weight in 30 Days: శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మనిషిని లావుగా తయారు చేయడమే కాకుండా అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అన్నింటికి మించి పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు అధిక బరువు పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తుంది. పొట్టలో కొవ్వును కరిగించుకుంటే.. ఆ అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.


  1. పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం పానియం తరహాలో కలుపుకుని తాగితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. 

  2. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గేందుకు సహకరించడమే కాకుండా పరోక్షంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

  3. ఒక గ్లాసు నిమ్మకాయ రసం సేవిస్తే.. శరీరానికి నీరసం దరిచేరదు. అందుకే మండు వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, ఉత్తేజం కలిగించే పానియంగా నిమ్మ రసం ఉపయోగపడుతుంది.

  4. బెల్లం పంచదారకు ప్రత్యామ్నాయం. బెల్లంలో జింక్, సెలెనియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. 

  5. నిమ్మరసంలో బెల్లం కలిపి సేవించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. శరీరంలో మెటాబాలిజం మెరుగుపడుతుంది.

  6. నిమ్మరసంలో బెల్లంతో పాటు అల్లం రసం కూడా కలిపి తీసుకుంటే ఇంకొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవచ్చంటే..


  • ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి.

  • నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను చిన్నగా, సన్నగా తరిగి అందులో వేయండి.

  • బెల్లం పొడి కలిపి ఒక ద్రవంలా కలిసేంత వరకు మిక్స్ చేయండి. 

  • ఇంకేం.. పొట్టలోని కొవ్వును తగ్గించే డ్రింక్ తయారైనట్టే.


ప్రతీ రోజూ ఉదయం ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు తగ్గిపోతాారు. వెయిట్ లాస్ మెథడ్స్‌లో ఇదొక సింపుల్ మెథడ్.



Also Read: దిల్ రాజుకు అండగా తమిళ నిర్మాతలు.. 'వారసుడు'ను టచ్ చేస్తే, తెలుగు సినిమాలు ఆడనివ్వం


Aslo Read: Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. ఆ సిరీస్ తరువాత ప్రకటన..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook