Overnight Oats With Chia Seeds For Weight Loss: ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. బరువు పెరగడం కారణంగా అనేక మందిలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. మరికొంతమందిలోనైతే కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. గుండెపోటు, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. నిజానికి చాలామందిలో బరువు పెరగడం కారణంగానే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే ఈ సమస్యతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పెరుగుతున్న బరువును తగ్గించడానికి చాలామంది అనేక రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. కొంతమంది సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామాలు చేస్తే మరి కొంతమంది డైట్లను పాటిస్తున్నారు. నిజానికి మనం తీసుకునే ఆహారాన్ని డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు పొందుతారు. అందులో బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రతిరోజు ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో భాగంగా ఓట్స్, చియా విత్తనాలు కలిగిన సలాడ్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ చియా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓట్స్, చియా వత్తనాల సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: 
1/2 కప్పు ఓట్స్
2 టేబుల్ స్పూన్లు చియా వత్తనాలు
1 కప్పు నీరు
1/2 కప్పు కూరగాయలు (క్యారెట్, టమోటాలు, దోసకాయలు, ఉల్లిపాయలు)
1/4 కప్పు చిక్కుళ్ళు (బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు గింజలు)
1/4 కప్పు పచ్చి ఆకుకూరలు (లేటస్, పాలకూర)
1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ నల్ల మిరియాలు


తయారీ విధానం:
ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గిన్నెలో ఓట్స్, చియా వత్తనాలు, నీరు వేసి బాగా కలపండి. 
ఇలా కలిపిన మిశ్రమాన్ని దాదాపు 30 నిమిషాల పాటు బాగా నానబెట్టండి.
ఆ తర్వాత కూరగాయలను చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
అలాగే మరో గిన్నెల చిక్కుళ్ళు తీసుకొని వాటిని మిక్సీ గ్రైండర్లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో నానబెట్టిన ఓట్స్, చియా వత్తనాల మిశ్రమాన్ని, కూరగాయలు, చిక్కుళ్ళు, పచ్చి ఆకుకూరలు వేసి బాగా కలపండి.
ఇందులోనే ఆలివ్ నూనె, నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు వేసి బాగా కలపండి. అంతే సులభంగా బరువు తగ్గించే రెసిపీ తయారైనట్లే.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
ఈ సలాడ్ లో మీరు కావాలనుకుంటే కూరగాయలకు బదులుగా పండ్లను కూడా వేసుకోవచ్చు. వీటిని చేర్చుకోవడం వల్ల మరింత ఆరోగ్యాన్ని పొందుతారు. 
ఈ సలాడ్ మరింత రుచిగా ఉండడానికి తేనెను కూడా మిక్స్ చేసుకోవచ్చు. 
అలాగే మీ డైట్ లో ప్రోటీన్లు పెంచుకోవడానికి అదనంగా ఫ్యాన్ లో వేయించిన చికెన్ ముక్కలు లేదా చేపలను కూడా వేసుకోవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి