Weight Loss Vegetables: రోజూ తీసుకునే ఆహారాలే.. బరువు తగ్గించడానికి, పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గడానికి చాలా రకాల ఆహారాలను తీసుకుంటారు. కానీ కూరగాయల్లో ఎలాంటివి తీసుకోవాలో చాలా మందికి తెలియదు. వీటి వల్ల కూడా బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు.. తప్పకుండా  తక్కువ కేలరీలు ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని తీసుకుంటే ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా బాడీ కూడా ఫిట్‌గా మారుతుంది. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి:


బచ్చలికూర:
పాలకూరలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే..  పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.  బచ్చలికూరలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా పాలకూర అన్ని సీజన్లలో లభిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు A, C, K, మెగ్నీషియంలు ఉంటాయి. కావున వీటిని తీసుకుంటే.. శరీరంలో అన్ని సమస్యలు దూరమవుతాయి.


క్యారెట్:
క్యారెట్లలో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా ఆహాంలో తీసుకుంటే శరీరాని మంచి పోషకాలు లభిస్తాయి. ఇది అన్ని సీజన్లలో సులభంగా లభిస్తుంది. వీటిలో బరువు తగ్గడానికి కావాల్సిన విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఫైబర్ ఉంటాయి.


బ్రోకలీ:
బ్రోకలీలలో తక్కువ పరిమాణంలో కేలరీలుంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. బ్రోకలీలో విటమిన్ సి, కె లు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని సలాడ్స్‌, సూప్స్‌లో తీసుకోవచ్చు.


బీట్‌రూట్స్‌:
స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి బీట్‌రూట్‌ను సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్ తక్కువ కేలరీలు, కొవ్వులు ఉండడం వల్ల సులభంగా బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఊబకాయం సమస్యలు కూడా దూరమవుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !


Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook