Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం

ఆగస్టు 15, 1947... భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తమైన రోజు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్న రోజు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 14, 2022, 09:36 AM IST
  • రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం..
  • రేపటితో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి
  • దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
 Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం

Happy Independence Day 2022: ఆగస్టు 15, 1947... భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తమైన రోజు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్న రోజు. ఎందరో త్యాగమూర్తులు, ఎన్నో పోరాటాల ఫలితంగా మాతృభూమికి ఈ స్వాతంత్య్రం దక్కింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో బానిసత్వంలో మగ్గిన దేశ ప్రజలకు విముక్తి దొరికింది. మహాత్మా గాంధీ నేత్రుత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘణ ఉద్యమం, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్య్రోద్యమంలో కీలక ఘట్టాలుగా చెప్పవచ్చు. ఈ ఆగస్టు 15తో భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. 76వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే విషెస్, కొటేషన్స్ మీకోసం..

ఇండిపెండెన్స్ డే కొటేషన్స్ :

దేశంలో స్త్రీలు అర్ధరాత్రి నడిరోడ్డుపై స్వేచ్చగా తిరగగలిగిన రోజున నిజమైన స్వాతంత్య్రం సాధించినట్లు-మహాత్మా గాంధీ 

ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ.. ఈ అర్ధరాత్రి భారతావని స్వేచ్చా, ఆకాంక్షలతో మేలుకొంది.-జవహర్ లాల్ నెహ్రూ

వాళ్లు నన్ను చంపుతారేమో.. కానీ ఆలోచనలను చంపలేరు. వాళ్లు నా శరీరాన్ని ఛిద్రం చేస్తారేమో.. కానీ నాలోని స్పూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఏమీ చేయలేరు.-భగత్ సింగ్

మీరు మీ రక్తాన్ని ధారపోయండి.. నేను దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తాను - నేతాజీ సుభాష్ చంద్రబోస్

ఒక దేశం పురోగతిని ఆ దేశ స్త్రీలు సాధించిన పురోగతిని బట్టి అంచనా వేస్తాను - డా.బీఆర్ అంబేడ్కర్

ఇండిపెండెన్స్ డే విషెస్, స్టేటస్ :

ఈ దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను తలుచుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుందాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే..

స్వాతంత్య్రం అనేది పోరాడి సాధించుకునేది. ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఆ చరిత్రను మనం మరవద్దు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.

మన జాతీయ జెండా నింగినంటుతూ రెపరెపలాడాలి.. గుండెల్లో జాతీయ భావన ఉప్పొంగాలి.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

భారతీయుడిగా నేనెప్పుడూ గర్వపడుతా.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరులందరికీ బిగ్ సెల్యూట్.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట పలు కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ ఇంటి మీద జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

Also Read: Horoscope Today August 14th : నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రేమ విషయాలను మూడో వ్యక్తితో చర్చించవద్దు...  

Also Read: TTD Darshan Waiting Time Today: పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News