Weight Loss with Banana: బరువు తగ్గడంలో కొన్ని పండ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నిజానికి ఇలాంటి పండ్లను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం సహా శరీర బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం మీరు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే అలాంటి పండ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండులో ఉండే లక్షణాలు..


పండ్లలో అరటి పండ్లు అతి తక్కువ ధరకు లభిస్తాయి. అందులో ప్రోటీన్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అరటి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు అరటి పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుచేస్తుంది. అరటిపండులో 64.3 శాతం నీరు, 1.3 శాతం ప్రోటీన్, 24.7 శాతం కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. 


అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు


1) అరటి పండు తినడం వల్ల బరువు తగ్గడం సహా అనేక సమస్యలను సహాయపడుతుంది. ఎముకల బలం కోసం అరటి పండు తప్పక తినాలి. అరటి పండులోని కాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. 


2) శారీరక అలసటను దూరం చేయడంలో అరటిపండ్లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే మూలకం అరటిపండ్లలో ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది శారీరక అలసటను నివారిస్తుంది.


3) జీర్ణ సమస్యలను దూరం చేయడంలో అరటిపండ్లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అరటిపండులోని పీచు పదార్థం మన జీర్ణవ్యవస్థకు సహకరిస్తుంది. అరటిపండ్లు యాసిడ్-రెసిస్టెంట్, కాబట్టి మీకు గుండెల్లో మంట సమస్య ఉంటే.. మీరు అరటిపండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.


4) అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటి పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో పొటాషియం అధికంగా చేరి.. హైపర్ కెమియా సమస్యకు దారి తీస్తుంది. ఇది కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అరటిపండులో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా దంత సమస్యలు పెరిగే అవకాశం ఉంది.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Roasted Garlic Benefits: పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుదల కోసం కాల్చిన వెల్లుల్లితో ఇలా చేయాలి!


ALso Read: Herbal Tea For High BP: అధిక రక్తపోటు నియంత్రణ కోసం ఈ 4 రకాల టీలను ట్రై చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.