Weight Loss With Walk Daily: ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పుడు బరువు పెరగడం కూడా తీవ్ర సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చాలా బరువు పెరగడం వల్ల గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాయామంలో భాగంగా వాకింగ్‌ కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలా వాకింగ్‌ చేస్తే బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా నడిస్తే సులభంగా బరువు తగ్గుతారు:
బరువు తగ్గడానికి, పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ప్రస్తుతం చాలా మంది 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసుల్లో కూర్చొవడం వల్ల తీవ్ర అనారోగ్యసమస్యలైనా గుండె పోటు, మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వాకింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.


కెనడాలో చేసిన అధ్యయనం:
ఓ అధ్యయనం ప్రకారం.. మూడున్నర నెలల పాటు రోజూ సుమారు గంటసేపు నడవడం వల్ల బరువు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఇలా మహిళలు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


ఒక రోజులో ఎంత సేపు వాకింగ్ చేయాలి?:
 నడవడం అనేది ఉత్తమైన వ్యాయామంగా చెప్పొచ్చు. ఇలా ప్రతి రోజూ నడవడం వల్ల ఊబకాయం సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అయితే ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌, బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల కొన్ని వారాల్లో ఫలితాలు పొందుతారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook