Weight Reduce Tips: బరువు తగ్గడమనేది ఇప్పటి ఆధునిక జీవనశైలిలో అతిపెద్ద సవాలు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అత్యంత రుచికరమైన ఆ ఐదు అల్పాహారాలు అలవాటు చేసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఆశ్చర్యంగా ఉన్నా...నిజమే ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్ కారణంగా బరువు పెరగడమనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. భోజనం మానేయడం, బ్రేక్‌ఫాస్క్ స్కిప్ చేయడం చేస్తుంటారు. కానీ వైద్యులు చెప్పే ప్రధానమైన హెచ్చరికను పెడచెవిన పెడుతుంటారు. అదే నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్. అంటే బ్రేక్‌ఫాస్ట్ పొరపాటున కూడా మానవద్దనేది వైద్యులు తరచూ చెప్పే మాట. ఇది ముమ్మాటికీ నిజం. 


ఓ పూట భోజనం మానేసినా ఫరవాలేదు గానీ..నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. మరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు ఎలా. అందుకే బరువు తగ్గేందుకు దోహదపడే రుచికరమైన అల్పాహార పదార్ధాలు కూడా ఉన్నాయి. అవి అలవాటు చేసుకుంటే చాలు. అటు రుచి..ఇటు వెయిట్ లాస్. 


ఆధునిక జీవనశైలితో వస్తున్న ప్రధాన మార్పుల్లో ఒకటి స్థూలకాయం. అందుకే చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాటిస్తుంటారు. ఇది కాస్త సవాళ్లతో కూడుకున్నదే. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీలు ఉండే అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. అయితే ఆ ఆల్పాహారాలు ఏంటి, ఎలా తయారు చేయాలనేది పరిశీలిద్దాం. ఇందులో ఐదు రుచికరమైన అల్పాహారాలున్నాయి. ఇవి మీ వెయిట్ లాస్ జర్నీపై ఏ విధమైన ప్రభావం చూపించవు. అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.


స్పినాచ్ ఆమ్లెట్


ముల్లంగితో కూడిన ఆమ్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రుచికరమైన ఛీజ్‌తో కలిపి తీసుకుంటే రుచి కూడా ఉంటుంది. ఇది తయారు చేసేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా 5 నిమిషాల్లోనే చేసేయవచ్చు. ఇది పూర్తిగా లో కార్బ్ డైట్


కెటో ఉప్మా మరియు థెప్లా


వెజ్ ఉప్మా చేయడమంత సులభం మరొకటి లేదు. కాలిఫ్లవర్, కూరగాయలు, మసాలాతో కలిపి వండే ఉప్మా ఆరోగ్యానికి..అటు వెయిట్ లాస్‌కు చాలా మంచిది. అదనపు రుచికి ఇంకేమైనా మిక్స్ చేసుకోవచ్చు. 


ఇక కెప్లా అనేది గుజరాతీ సాంప్రదాయ వంటకం గోధుమ పిండితో చేసే అల్పాహారం ఇది. ఇందులో ఫ్లెక్స్ సీడ్స్ మెంతినీరు ఉంటుంది. ఇది పూర్తిగా లో కార్బ్ కావడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. 


యాపిల్ మరియు చియా సీడ్ 


ఇది ఆరోగ్యానికి మంచిది..చాలా రుచికరమైంది. మూడు ప్రధాన వస్తువులతో కేవలం 5 నిమిషాల్లో చేయవచ్చు. యాపిల్ చియా సీడ్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల శరీరంలో మెటాబొలిక్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. 


కెటో పోహా


కెటో పోహా అనేది కాలిఫ్లవర్ ఫ్లోరెట్స్, బియ్యంతో కలిపి వండుతారు. కాలిఫ్లవర్ స్టెమ్స్‌ను బంగాళాదుంపలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. చాలా త్వరగా కేవలం 5 నిమిషాల్లోనే వండవచ్చు. ఇక నుంచి మీరు కూాడా బ్రేక్‌ఫాస్ట్ మానకుండా..ఈ ఐదు అల్పాహార పదార్ధాల్ని అలవాటు చేసుకుంటే అటు ఆరోగ్యానికి ఇటు వెయిట్ లాస్ ప్రణాళికకు ఉపయుక్తంగా ఉంటుంది. 


Also read: Summer Hair Care Tips: వేడి వల్ల జుట్టు మీ పాడవుతుందా..ఈ 7 చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పొందండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook