Water Apple Benefits:  మనం మార్కెట్లో రకరకాల పండ్లను చూస్తూ ఉంటాం. సీజన్ ని బట్టి కూడా పండ్లు మారుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో మార్కెట్లలో కొత్త కొత్త పండ్లు వస్తున్నాయి. అందులో భాగంగానే వాటర్ యాపిల్ ఒకటి. ఇది చూడడానికి గులాబీ రంగు లో ఉంటుంది. కానీ దీనిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ పండ్లు సూపర్ మార్కెట్లతో పాటు రోడ్లపై కూడా సూపర్ మార్కెట్లతో పాటు రోడ్లపై కూడా విపరీతంగా లభిస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల ఈ పండ్లకు సంబంధించిన చెట్లను కూడా విపరీతంగా అమ్ముతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి చెట్లకు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అయితే ఈ పండు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తింటూ ఉంటారు.. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మం జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా ఈ వాటర్ యాపిల్స్ సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



ముఖ్యంగా ఈ వాటర్ యాపిల్స్ ని షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయని ఇటీవలే నిపుణులు పరిశోధనలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ పండ్ల లో ఉండే ఐసో మెరిక్ ప్లేవ‌నోన్, చాల్ కోన్ గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడతాయని ఆయుర్వేదన గుణాలు చెబుతున్నారు. దీంతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఇందులో అనేక రకాల రసాయనాల సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.


Also Read Protein Powder: ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేసుకోండి ఇలా..


జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి:
వాటర్ యాపిల్స్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే రసాయన గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. దీంతోపాటు దృఢంగా చేసేందుకు కూడా ఈ వాటర్ యాపిల్స్ ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి మరణాంతక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారాలతో పాటు తీసుకోవడం ఎంతో మంచిది.


Also Read Cardamom Health Facts: యాలకుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter