బయటి నుంచి ఇంటికి రాగానే ఏదైనా తినాలని అనిపిస్తుంది. భోజనం టైం కాకపోతే ఏదైనా స్నాక్స్ తో సర్దుకుంటాం. భోజన సమయానికి ప్లేట్ ముందు కూర్చుంటాం.. కానీ ఆకలి కాదు. ఈ సమస్య సహజంగా అందరికీ ఉండేదే..! స్నాక్స్ తీసుకుంటే త్వరగా ఆకలి కాదు. అవి జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సగ్గుబియ్యం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* నిజానికి సగ్గుబియ్యాన్ని పరిశ్రమల్లో తయారుచేస్తారు. అధికంగా తమిళనాడు (70%), కేరళ, ఆంధ్ర ప్రదేశ్ (30%) ఉత్పత్తిచేస్తాయి. తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం సగ్గుబియ్యం.   ఇందులో కార్బొహైడ్రేడ్లు అధికంగా ఉంటాయి. అందుకే శక్తినిచ్చే శీతలపానీయాలలో, బ్రెడ్‌ ఐటమ్స్‌లో వీటిని అధికంగా ఉపయోగిస్తారు.


* ఆఫీస్ నుండి ఇంటికి అలసటతో వస్తుంటారు. అలాంటప్పుడు సగ్గుబియ్యం వంటలు బాగా ఉపయోగపడతాయి. అందులో ఒకటి  సబుదాన సలాడ్‌. దీని వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. తక్షణ ఎనర్జీ లభిస్తుంది.


* పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం.. రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 


* తెల్ల సగ్గుబియ్యం గింజలతో వడలు, కిచిడీ, పాయసం లాంటి వంటలు చేసుకోవచ్చు. వీటిని చేసుకోవడం కూడా సులభమే. 


* సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు రావు. పిల్లలకు పంచదార కలిపి ఇవ్వండి. 


* బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే, బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని వైద్యులు చెబుతారు. 


* పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు సగ్గుబియ్యంతో ఉంటాయి. కనుక, అన్ని వయసులవారు, పిల్లలు సగ్గుబియ్యం తీసుకోవచ్చు.