Reasons For Fatigue: కొంతమంది బాగా తింటున్నా, బాగా నిద్రపోతున్నా ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. ఎలాంటి పనులు చేయాలి అన్న అలసటగా అనిపిస్తుంది. కొంచె పని చేసిన చిరకాకు కలుగుతుంది. అయితే దీనికి అనేక కారణాలు ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు డాక్టర్‌లను సంప్రదించగా వారు చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్లే దీనికి కారణమని చెబుతుంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా, ఈ అలవాట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్చుకుంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఉండవచ్చు. అయితే ఎలాంటి దీని కారణంగా మనం ఎప్పుడు అసలట, నీరసంగా ఉంటాము అనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారణాలు:


మన శరీరంలో తగినంత నీరు లేకపోవడం కారణంగా నీరసంగా ఉంటాము. దీని వల్ల దాహం కలుగుతుంది. అయితే వైద్యుల ప్రకారం దాహం అనిపించినప్పుడే నీరు తీసుకోవడం మంచిది కాదు. డీహైడ్రేషన్ అప్పటికే మొదలై మనం నీరసంగా అవడం మొదలవుతుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం రోజూ 8 గ్లాసుల నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడు శరీరాని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. నీరసం అనేది ముఖ్యంగా ఐరన్‌ లోపం కారణంగా కలుగుతుంది. దీని వల్ల ఎలాంటి పని చేయాలి ఉండదు. ప్రతిరోజు తీసుకోనే ఆహారంలో ఐరన్‌ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్‌ లోపం కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుంది. 


మనలో చాలామంది ఉదయం, మధ్యహ్నం అధికంగా కాఫీ, టీలు తీసుకుంటారు. అయితే నిద్రకు 5-6 గంటల ముందు నుంచి కాఫీ, టీ, కెఫిన్ కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీరు నీరసంగా ఉండరు. దీంతో పాటు ముందు రోజు రాత్రి తాగిన ఆల్కహాల్‌ వల్ల మరుసటి రోజు కూడా నీరసం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొతాద్దులో ఆల్కహాల్‌ తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం చాలా మంచిది. కదలకుండా కూర్చుండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా శరీరం నీరసంగా మారుతుంది. ఫిట్ గా ఉండాలంటే కొంత కష్టపడి వ్యాయామం చేయాలి.


నీరసాన్ని నివారించడానికి:


థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత లేదా నిద్రలేమి వంటి కొన్ని వైద్య పరిస్థితులు నీరసానికి దారితీస్తాయి. ఈ పరిస్థితులను నిర్ధారించి చికిత్స చేయడం వల్ల మీ లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీవనశైలి మార్పులతో మీ నీరసాన్ని మెరుగుపరచలేకపోతే, మీ వైద్యుడిని సంప్రదించండి. వారు మీ లక్షణాలకు కారణాన్ని నిర్ధారించడంలో చికిత్సా ఎంపికలను సిఫార్సు చేయడంలో సహాయపడతారు. ప్రతిరోజూ 15-30 నిమిషాలు సూర్యరశ్మిని పొందడం వల్ల మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి  శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.  సూర్యరశ్మిని పొందలేకపోతే, వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం గురించి మీ వైద్యుడితో మాట్లాడండి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మీరు ఎప్పుడూ యాక్టివ్ గా, ఉత్సాహంగా ఉండవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవ



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి