Blood Sugar Tips: శరీరంలో తలెత్తే సకల సమస్యలకు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే. ఇందులో అతి కీలకమైంది అధిక రక్తపోటు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా లేకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తపోటుకు సంబంధించి పలు అధ్యయనాల్లో వెలుగుచూసిన అంశాలు షాకింగ్ కల్గిస్తున్నాయి. తరచూ రక్తపోటులో హెచ్చుతగ్గులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. మస్తిష్కంపై చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఏజీయింగ్ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది. రక్తపోటుపై జరిపిన అధ్యయనం ఇటీవల న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో 65 ఏళ్లు దాటినవారిలో 4,770 మందిని పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు మానసికంగా ప్రభావం చూపిస్తాయి. అన్నింటికంటే షాక్ కల్గించే అంశమేమంటే అధిక రక్తపోటు కంటే రక్తకపోటులో హెచ్చుతగ్గులే అత్యంత ప్రమాదకరమని తేలింది. అందుకే హై బీపీ కంటే హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.


బ్లడ్ ప్రెషర్‌ను ప్రతి మూడేళ్లకోసారి అధ్యయనం చేయగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్ధ్యం తగ్గినట్టు తేలింది. అంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మెదడు వికాసంపై ప్రతికూల ప్రభావం కన్పించింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు బ్లడ్ ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఎప్పుడూ పౌష్టిక ఆహారం అంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు బ్లడ్ ప్రెషర్ మందులు తప్పకుండా వాడాలి. మద్యం, ఉప్పు, ధూమపానానికి దూరంగా ఉండాలి.


Also read: Chia Seeds: చియా సీడ్స్ అతిగా తింటే ఏమౌతుంది, ఈ ఐదు రకాల వ్యక్తులకు నిషిద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.