Chia Seeds: చియా సీడ్స్ అతిగా తింటే ఏమౌతుంది, ఈ ఐదు రకాల వ్యక్తులకు నిషిద్ధం

మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చుట్టూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. చియా సీడ్స్‌ను అందుకే సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమందికి చియా సీడ్స్ హానికారకం అని మీకు తెలుసా. ఎవరెవరికి చియా సీడ్స్ మంచివి కావో తెలుసుకుందాం.

Chia Seeds: మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చుట్టూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. చియా సీడ్స్‌ను అందుకే సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమందికి చియా సీడ్స్ హానికారకం అని మీకు తెలుసా. ఎవరెవరికి చియా సీడ్స్ మంచివి కావో తెలుసుకుందాం.
 

1 /5

చియా సీడ్స్ ఎంత తీసుకోవాలి రోజుకు రెండు చెంచాల చియా సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇదే ఆరోగ్యం. ఏదైనా అనారోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే మాత్రం వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి.

2 /5

బరువు పెరగడం చియా సీడ్స్‌లో కేలరీలు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే చియా సీడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు మరింత పెరగవచ్చు. బరువు నియంత్రణకు తీసుకునే ఉద్దేశ్యం ఉంటే మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు

3 /5

జీర్ణక్రియ చియా సీడ్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే అతిగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం, కడుపులో నొప్పి, గ్యాస్, స్వెల్లింగ్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి జీర్ణ సంబంధ సమస్యలుండేవారికి మంచిది కాదు. 

4 /5

అధిక రక్తపోటు చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఫలితంగా గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కల్గిస్తాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటంతో అధిక రక్తపోటు మందులు తీసుకునేవారికి మంచిది కాదు. బ్లడ్ ప్రెషర్ మరింత పెరగవచ్చు

5 /5

డయాబెటిస్  మధుమేహం వ్యాధిగ్రస్థులకు చియా సీడ్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్‌లు బ్లడ్ షుగర్‌ను నిస్సందేహంగా నియంత్రిస్తాయి, కానీ పరిమితి మించి తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ తప్పుతాయి.