5 Vitamins Deficiency: మనంం ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధులకు ప్రధాన కారణం లైఫ్‌స్టైల్. ఉరుకులు పరుగుల జీవితంలో విశ్రాంతి లేకపోవడంతో అలసట తీవ్రంగా ఉంటోంది. ఇటీవలి కాలంలో ఇదొక ప్రధాన సమస్యగా మారింది. సరైన నిద్ర లేకపోవడం, ఆందోళన, ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంటుంది. అయితే ఇవన్నీ లేకుండా అంటే మంచి నిద్ర ఉన్నప్పుడు కూడా అలసట ఉంటుంటే కారణమేంటి..5 రకాల విటమిన్ల లోపంతో ఈ పరిస్థితి ఉంటుందంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ బి9 లేదా ఫోలేట్ లోపముంటే శరకీరంలో కొత్త సెల్స్ నిర్మాణంలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా అలసట, నైరాశ్యం, ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం గమనించవచ్చు. అందుకే తినే ఆహారంలో ఫోలేట్ పరిమాణం ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం ఆకు కూరలు, పండ్లు , తృణ ధాన్యాలు తప్పకుండా తీసుకోవాలి. ఇక రెండవది ఐరన్ లోపం. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో అతి ముఖ్యమైన మినరల్ ఐరన్. ఐరన్ లోపముంటే ఎనీమియా సమస్య ఉంటుంది. దాంతో రక్తంలో ఆక్సిజన్ అన్ని అవయవాలకు సరఫరా కాదు. ఫలితంగా అలసట, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఐరన్ లోపం దూరం చేసేందుకు ఆకు కూరలు, మాంసం, గుడ్లు తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. 


మూడవ కారణం విటమిన్ డి లోపించడం. శరీరంలో కాల్షియం సంగ్రహణకు దోహదం చేసేది ఇదే. శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాల్లో  నిస్సత్తువ ఆవహిస్తుంది. అలసటగా ఉంటుంది. మీకూ ఈ పరిస్థితి ఎదురైతే సూర్యరశ్మి కిరణాల ద్వారా విటమిన్ డి పొందవచ్చు. లేదా ప్యాటీ ఫిష్, గుడ్లు తినాలి. నాలుగవ కారణం విటమిన్ బి12 లోపం. ఇది శరీరానికి చాలా అవసరం. రక్త నాళాలు, రక్త కణాల్ని బూస్ట్ చేస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే తీవ్రమైన అలసట ఉంటుంది. తరచూ తలనొప్పి వస్తుంటుంది. నీరసం ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. విటమిన్ డి లోపుముంటే పాల ఉత్పత్త్తులు, గుడ్లు, మాంసం, బీన్స్ తప్పకుండా తీసుకోవాలి.


ఇక ఐదవ కారణం మెగ్నీషియం లోపం. కండరాలు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. అంటే చాలా కీలకమైన మినరల్. మెగ్నీషియం లోపిస్తే కండరాలు లాగుతుంటాయి. అలసట ఉంటుంది. ఒత్తిడిగా ఉంటుంది. మెగ్నీషియం లోపం లేకుండా ఉండాలంటే నట్స్, సీడ్స్, తృణ ధాన్యాలు తప్పకుండా తీసుకోవాలి. అందుకే తీనే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేవి చూసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురుకావు.


Also read: Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు అసలు జరిగిందేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.