Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?
What happens if you get COVID-19 after taking the vaccine first dose ? కరోనావైరస్‌కు చెక్ పెట్టడానికే కొవిడ్-19 వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం. కానీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే అప్పుడేం చేయాలి ? కరోనా టీకా రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి ? ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే అసలు రెండో డోస్‌కి అర్హత అలాగే ఉన్నట్టేనా లేదా ?
What happens if you get COVID-19 after taking the vaccine first dose ? కరోనావైరస్‌కు చెక్ పెట్టడానికే కొవిడ్-19 వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం. కానీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే అప్పుడేం చేయాలి ? కరోనా టీకా రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి ? ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే అసలు రెండో డోస్‌కి అర్హత అలాగే ఉన్నట్టేనా లేదా ? ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న అనుభవాలు, అనుమానాల్లో ఇదీ ఒకటి. చాలా మందిలో కలుగుతున్న ఈ సందేహాలకు వైద్య నిపుణుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత Coronavirus సోకే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి ?
కరోనాకు చెక్ పెట్టడానికే వ్యాక్సిన్ తయారు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే అయినా.. ఏ వ్యాక్సిన్ కూడా కరోనా నుంచి 100% ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనేదే చాలా మందికి తెలియని విషయం. ఇంకా చెప్పాలంటే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ లేదా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకదు అనే గ్యారెంటీ ఏమీ లేదన్నమాట.
Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ? మీకు ఈ విషయం తెలుసా ?
Two doses: రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకితే ?
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకితే దాన్ని బ్రేక్‌థ్రూ కేసులుగా పిలుస్తున్నారు. దేశంలో బ్రేక్ థ్రూ కేసులు చాలా అరుదే. అవి కూడా తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని ఓ సర్వేలో తేలింది.
First dose: ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లకు కరోనా సోకడానికి కారణం ?
కరోనా టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. కరోనా ఫస్ట్ డోస్ ద్వారా మానవ శరీరంలోకి ఇంజెక్ట్ అయ్యేది సగం ఇమ్యునిటీ పవర్ మాత్రమే. అంటే అది వైరస్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేదన్నమాట. అందుకే కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అసలే వీల్లేదు.
Tests positive before second dose: కరోనా సెకండ్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, షెడ్యూల్ చేసుకున్నాకా కరోనా వస్తే ఏం చేయాలి ?
కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాం. సెకండ్ డోస్ కోసం షెడ్యూల్ చేసుకున్నాక కరోనా సోకింది. ఇప్పుడేం చేయాలి ? కరోనా సోకిన తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటే పని చేస్తుందా ? ఇలాంటి సందేహాలు చాలా మందికి కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నా కరోనా సోకే అవకాశాలున్నాయి కనుక. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు సెకండ్ డోస్ తీసుకోకుండా అసలే ఉండొద్దు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. కరోనా తగ్గి నయమైన తర్వాత మళ్లీ షెడ్యూల్ చేసుకుని కరోనా సెకండ్ డోస్ తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధినిరోధకత పెరిగి అది వైరస్‌లను దూరం పెడుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుకున్న రోజు (Second dose date) కంటే ఆలస్యంగా తీసుకుంటే వ్యాక్సిన్ పనిచేస్తుందా అనే సందేహాలు కూడా అవసరం లేదు అని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
Also read : Black Fungus: బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించకపోతే..అది ప్రాణాల్ని హరించేస్తుంది జాగ్రత్త
ఏదేమైనా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకునేలోపు (Gap between COVID-19 vaccine first dose and second dose) కరోనా సోకినట్టయితే, కరోనా పూర్తిగా నయమయ్యే వరకు వేచిచూసి ఆ తర్వాత రెండో డోస్ తీసుకోవడం శ్రేయస్కరం.
COVID-19 vaccine: కరోనా టీకా అసలు ప్రభావం ఎప్పుడు చూపిస్తుంది ?
కరోనా టీకా తొలి డోస్‌తో ఇమ్యునిటీ కొంత మేరకే వస్తుంది. రెండో డోస్ తీసుకున్నాకా 14 రోజుల తర్వాత శరీరంలో యాంటీ బాడీస్ తయారై వైరస్‌తో పోరాడే శక్తిని పొందుతుంది. అప్పటివరకు కరోనా సోకే ప్రమాదం లేకపోలేదు.
Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?
COVID-19 guidlines: కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి:
అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్క్ ధరించడం (Face mask), సోషల్ డిస్టన్సింగ్ పాటించడం, చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, చేతులకు గ్లవ్స్ ధరించడం వంటి నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook