Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్ ?

Surgical face mask or 5-layered mask: కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2021, 06:08 PM IST
Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్ ?

Surgical face mask or 5-layered mask: కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ప్రకారం.. సాధారణ ఫేస్ మాస్క్ కంటే 5 పొరల మాస్క్ ధరించడమే మేలు అని తేలింది. ఔట్‌డోర్‌లో కాకుండా ఇండోర్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు నాణ్యత కలిగిన మాస్క్ ఉపయోగించడంతో పాటు గాలి, వెలుతురు సమృద్ధిగా (Ventilation) ఉండేలా చూసుకోవాలని ఐఐటి భువనేశ్వర్ వెల్లడించిన ఓ అధ్యయనం పేర్కొంది. ఫేస్ మాస్క్, షీల్డ్ వంటివి ధరించినప్పుడు శ్వాసతీసుకుని, వదిలే క్రమంలో ఎదురయ్యే పరిణామాలను నిశితంగా పరిశీలించినట్టు ఐఐటి భువనేశ్వర్ పేర్కొంది. 

చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది. సోషల్ డిస్టన్సింగ్ మార్గదర్శకాలు పాటించలేని చోట ఇదీ మరీ డేంజర్ అని అధ్యయనం అభిప్రాయపడింది. ఒకవేళ N95 మాస్క్ (N95 Masks) ధరించినట్టయితే.. అందులోంచి నోటి తుంపర్లు బయటికి వచ్చే అవకాశం లేదని పరిశోధకులు తెలిపారు. అయితే, మాస్క్ ధరించే క్రమంలో ముక్కుకు, మాస్కుకు మధ్య గ్యాప్ ఉన్నట్టయితే, అందులోంచి తుంపర్లు బయటికి రావడానికి ఆస్కారం ఉందని పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. 

Also read : Ginger health benefits: రోజూ అల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

ఐదు పొరలు (Five-layered mask) కరోనా నుంచి మరింత సురక్షితం అని తేల్చిన పరిశోధకులు.. అందులోంచి నోటి తుంపర్లు బయటికొచ్చే అవకాశాలు అంతగా లేవని తెలిపారు. తమ అధ్యయానికి సంబంధించిన ఫలితాలపై అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (American Institute of Physics) అడ్వాన్సెస్ జర్నల్‌లో ఓ వార్తా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించినట్టు పరిశోధకులు తెలిపారు.  

మొత్తానికి చాలామంది విరివిగా ఉపయోగిస్తున్న సాధారణ మాస్కుల కంటే.. ఐదు పొరలతో రూపొందించిన N95 మాస్కులే కరోనావైరస్ (COVID-19) నుంచి సురక్షితంగా ఉంచగలవని అధ్యయనం తేల్చినట్టు ఐఐటి భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.వి. రాజకుమార్ తెలిపారు. కరోనాపై పోరాటంలో భాగంగా తాము కూడా ఎన్నో పరిశోధనలు చేశామని రాజకుమార్ చెప్పుకొచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News