Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్!
Health Tips For Depression | డిప్రెషన్ సమస్య కొన్నిసార్లు కుటుంబాన్నే దెబ్బ తీస్తుంది. ఆధునిక జీవన విధానం పని ఒత్తిడి, నిరుద్యోగ సమస్య, కుటుంబ, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడవచ్చు. అయితే యోగాతో డిప్రెషన్‌తో ఎలా జయించవచ్చో తెలుసుకోంది.
Health Tips To Overcome Depression | భరించలేని ఒత్తిడి, మానసిక ఆందోళనను ఎదుర్కోవడాన్ని డిప్రెషన్ (Depression) అంటారు. డిప్రెషన్ సమస్యతో కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ కొందరు సొంతంగా తమకు తాము ప్రేరణ కలిగించుకుంటే, మరికొందరు ఇతరుల మాటలు విని చెడు ఆలోచనల్ని వదిలేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమతోనూ డిప్రెషన్ మహమ్మారిని తరిమేయవచ్చునని మీకు తెలుసా. మన జీవనశైలి మార్చుకుంటే డిప్రెషన్ సమస్యను జయించడంతో పాటు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాం. కొన్ని యోగా ఆసనాలు రెగ్యూలర్‌గా చేస్తే డిప్రెషన్ (Yoga For Depression) నుంచి బయటపడొచ్చు. ఆ ఆసనాలెంటో తెలుసుకుందామా. CoronaVirus మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు
శవాసనం (Corpse Pose or Shavasana)
ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే స్కూళ్లో విద్యార్థులతో గేమ్స్ టైమ్‌లో శవాసనం వేయిస్తారు. దీని వల్ల ప్రశాంతత లభించి మనసు తేలిక అవుతుంది. శరీరంతో పాటు మనసు పునరుత్తేజితం అవుతుంది.
నాడీ శోధన (ప్రాణామాయం) (Pranayama Pose)
ప్రామాయామాన్ని ఆల్టర్‌నెట్ నాస్ట్రిల్ బ్రీథింగ్ టెక్నిక్ అని పిలుస్తారు. శ్వాసమీద ధ్యాసపెట్టి నాడీ శోధన చేయడం వల్ల ఆందోళన దూరం అవుతుంది. నాడులన్నీ ఉత్తేజితమై మెదడు చురుకుగా పనిచేస్తుంది. మనకు తెలీకుండానే శారీరక శ్రమ జరిగి ప్రశాంతత లభిస్తుంది. Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!
బాలాసనం (Balasana or Child's Pose)
బాలసనం వేయడం చాలా తేలిక. చిన్న పిల్లలు చేసే పనిలా ఉంటుంది. బాలాసనం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. బాలసనం వేసినప్పుడు మనకు ఏ కష్టాలు లేవనే భావన కలుగుతుంది. అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
సేతుబంధు ఆసనం (Setu Bandhasana or Setu Bandha Sarvangasana)
సేతుబంధాసనం వేయడం ద్వారా థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఏకాగ్రతతో ఆ ఆసనం వేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు తేలిక అవుతుంది. ఊపిరితిత్తులకు సేతుబంధాసనం మేలు చేస్తుంది. శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..