What is PCOS And How To Over Come It: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక రకమైన శారీరక రుగ్మత అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్‌ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీసీఓఎస్‌తో బాధపడే వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
పునరుత్పత్తి వయస్సు కలిగిన మహిళల్లోనే ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అత్యంత సాధారణంగా కనిపించే సమస్య. ఈ శారీరక రుగ్మత లక్షణాలు ఎలా ఉన్నాయంటే..


అండాశయ తిత్తులు
ఇర్రెగ్యులర్ పీరియడ్స్
మొటిమలు
జుట్టు పలచగా మారడం
అధిక బరువు పెరుగుట


పరిశోధకులు చెబుతున్న వివరాల ప్రకారం.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ రావడానికి గల కారణాలు సంక్లిష్టంగా ఉంటాయని తెలుస్తోంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇందులో కీలకమైనదిగా చెబుతుంటారు. మీరు మీ లైఫ్ స్టైల్లో మార్పులు, ఆహార నియమాల ద్వారా పీసీఓఎస్ లక్షణాలను అదుపులో పెట్టుకోవచ్చు కానీ ఒకేసారికి ఈ రుగ్మతకు చెక్ పెట్టే చికిత్స లేదు. ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సను ప్రయత్నించాలనుకుంటే.. అంతకంటే ముందుగా మీరు మీ డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే పద్ధతిని అనుసరించాలి అనుకుంటున్నారో.. అది మీకు సరిపోతుందా లేదా, ఎలాంటి డోస్ వాడాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది.


ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, కొన్ని ఆహార పదార్ధాలను దూరం పెట్టడం వల్ల పీసీఓఎస్ ని అదుపులో ఉంచుకోవచ్చు. పోషక విలువలు ఉన్న ఆహారం మీ హార్మోన్లను సమన్వయం చేస్తూ మీ పీరియడ్స్ ని సకాలంలో వచ్చేలా చేస్తుంది. 


వోల్ ఫుడ్స్ తీసుకోవాలి
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మీ ఆహారంలో చేర్చుకోగలిగిన వోల్ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాంటప్పుడే మీ ఎండోక్రైన్ వ్యవస్థ సరిగ్గా పనిచేసి మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ ని మెరుగ్గా నియంత్రించగలదు.


ఐరన్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి
ఈ పీసీఓఎస్ తో బాధపడే వారిలో కొంతమందికి పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. అలాంటి కేసుల్లో వారికి ఐరన్ లోపం తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలకూర, కోడిగుడ్లు, బ్రోకొలి వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. డాక్టర్ ని సంప్రదించిన తరువాతే ఈ పద్ధతి పాటించాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో ఐరన్ అధిక మోతాదులో తీసుకోవడం కూడా ఇబ్బందికరమే అవుతుంది.


మెగ్నిషియం ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి
బాదాం, కాజు, పాలకూర, అరటి పండ్లు వంటి పీసీఓఎస్‌తో బాధపడే వారికి సరైన ఆహారం. వీటిలో మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది.  


జీర్ణశక్తి కోసం ఫైబర్
జీర్ణశక్తి పెరిగేలా ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తినాలి. పప్పు ధాన్యాలు, బీన్స్, బ్రోకోలి, బ్రసెల్స్ స్ప్రౌట్స్, అవోకాడో వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 


కాఫీని దూరంగా పెట్టాలి
కాఫీ తాగడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్స్ లెవెల్లో మార్పులు చోటుచేసుకుని హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా కాఫీ స్థానంలో హెర్బల్ టీ, గ్రీన్ టీ లాంటివి తాగడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. పైగా అధిక బరువు కలిగిన మహిళలు తమ బరువును తగ్గించుకునేందుకు సైతం గ్రీన్ టీ తాగొచ్చు. అలా కూడా ఇది వారికి ఉపయోగపడుతుంది.


హెర్బల్ ట్రీట్మెంట్
మీ శరీరం స్వతహాగా ఇన్సూలిన్‌ని నియంత్రించే శక్తిని కోల్పోయినప్పుడు అది మీ శరీరంలో అనేక ఇతర రుగ్మతలకు కారణం అవుతుంది. అందులోనే పీసీఓఎస్ కారణంగా ఏర్పడే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఒకటి. 


మక్కా రూట్:
సంతాన సాఫల్యంలో ఎదుర్కొనే సమస్యలకు మక్కా చెట్టు వేర్లు ఎంతో ఉపయోగపడతాయి. పీసీఓఎస్ లక్షణాల్లో ఒకటైన మానసిక ఒత్తిడిని జయించేందుకు కూడా ఈ మక్కా వేర్లు ఉపయోగపడతాయి.


అశ్వగంధ
అశ్వగంధతో కార్సిసల్ లెవెల్స్ మెరుగుపడి మానసిక ఒత్తిడి సమస్యను నివారిస్తుంది. పీసీఓఎస్ లక్షణాలను సైతం ఇది తగ్గిస్తుంది.


తులసి దళాలు
తులసీ దళాలతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపులో పెట్టుకోవడంతో పాటు అధిక బరువును తగ్గించుకోవచ్చు. అలాగే కార్టిసల్ లెవెల్స్‌ని కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Side Effects of Using More AC: ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా ? ఐతే మీకు ఈ జబ్బులు ఖాయమట


హెల్తీ వెయిట్ మెయింటెన్ చేయాలి
అధిక బరువు పెరగకుండా లైఫ్ స్టైల్లో తగిన మార్పులు చేసుకోవాలి. బరువు పెరిగే కొద్దీ పీసీఓఎస్ లక్షణాలు అదుపులోకి రాకపోగా.. వారితో వచ్చే సమస్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. లో కేలరీ ఫుడ్స్ తీసుకోవాలి.. హై కేలరీలు ఉండే ఫుడ్స్‌ని దూరం పెట్టాలి. చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిలో హై కేలరీలు ఉంటాయనే విషయం మర్చిపోవద్దు.


క్రమం తప్పకుండా వ్యాయమం అవసరం
క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది. యోగా, స్విమ్మింగ్, లైట్ ఏరోబిక్స్ వంటి వాటితో బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. ఎలాంటి వ్యాయమం అయితే, మీ శరీరానికి సూట్ అవుతుందో మీ డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


ఇది కూడా చదవండి : Weight loss Tips: రోజూ క్రమం తప్పకుండా రాత్రి వేళ ఇలా చేస్తే..స్థూలకాయం ఇట్టే మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK