Weight loss Tips: ఇటీవలి కాలంలో స్థూలకాయం సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి. ఈ రెండింటి వల్ల స్థూలకాయం వెంటాడుతోంది. రోజురోజుకూ బరువు పెరిగిపోతున్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నంచినా విఫలమౌతుంటే ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే మీ స్థూలకాయం ఇట్టే మాయం కావడం ఖాయం..
స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యకు డైటింగ్, వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదు. జీవనశైలి కూడా మార్చుకోవాలి. అన్నీ క్రమపద్ధతిలో ఉండాలి. రోజూ గడిపే లైఫ్‌స్టైల్ ఒకేరీతిలో ఉండాలి. ఇందుకు ఉపయోగపడే కొన్ని సులభమైన చిట్కాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన పద్ధతులు కొన్ని. ఇవి పాటిస్తే స్థూలకాయం వెన్నలా కరిగిపోతుంది.
రోజూ 7 గంటలకే డిన్నర్ పూర్తి
రోజువారీ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన మార్పు ఇది. రోజూ రాత్రి డిన్నర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటలకు పూర్తి చేసేయాలి. 7 తరువాత డిన్నర్ మంచి అలవాటు కానేకాదు. ఎందుకంటే రాత్రి భోజనానికి , నిద్రకు మధ్య కనీసం 2 గంటలు విరామం తప్పకుండా ఉండాలి. అర్ధరాత్రి భోజనం చేస్తే సరిగ్గా జీర్ణం కూడా కాదు. దాంతో స్థూలకాయం పెరిగిపోతుంది. బరువు తగ్గాలంటే రాత్రి డిన్నర్ 7 గంటలకు పూర్తి కావల్సిందే.
ఫైబర్ ఫుడ్ ప్రాధాన్యత
రాత్రి భోజనం ఎప్పుడూ లైట్‌గా హెల్తీగా ఉండాలి. బరువు తగ్గాలనుకుంటుంటే..డిన్నర్లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. రోటీ మంచి ప్రత్యామ్నాయం.
గోరు వెచ్చని నీళ్లు
బరువు తగ్గించుకోవాలకునేవాళ్లు డిన్నర్ తరువాత గ్రీన్ టీ లేదా వేడి నీరు తాగడం అలవాటుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. స్థూలకాయం తగ్గేందుకు దోహదపడుతుంది.
తగిన నిద్ర
నిద్రకు , స్థూలకాయానికి మధ్య చాలా సంబంధముంది. బరువు తగ్గించుకోవాలంటే రోజూ రాత్రి వేళ మంచి నిద్ర ఉండాలి. రాత్రి నిద్ర తప్పనిసరిగా 7-8 గంటలు ఉంటే మంచిది. దీనివల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది బరువు సులభంగా తగ్గుతుంది.
పసుపు పాలు
బరువు తగ్గించేందుకు మరో అద్బుతమైన ఔషధం పసుపు పాలు. రోజూ రాత్రి వేళ పడుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే ధర్మోజనిక్ గుణాలు బరువు తగ్గించేందుకు ఉపకరిస్తాయి.
Also read: Healthy Liver Tips: రోజూ ఈ పదార్ధాలు తింటే లివర్ డ్యామేజ్ తప్పదు, వెంటనే దూరం చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook