Wheatgrass Benefits: మధుమేహం వ్యాధి ఉన్నవారు ఈ జ్యూస్ తాగండి..!!
Wheatgrass Benefits: ప్రస్తుతం చాలా మంది మధుమేహం లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉండేందుకు పలు ఆహార నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Wheatgrass Benefits: ప్రస్తుతం జీవనశైలికి మారుతున్న నేపథ్యంలో మానవుల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉండేందుకు పలు ఆహార నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆయుర్వేదంలో పేర్కొన్న గోధుమ గడ్డితో చేసిన జ్యూస్ తీసుకోవాలని సలహా ఇస్తారు. దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని.. ఇది మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనాన్ని ఇస్తుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.
గోధుమ గడ్డి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గోధుమ గడ్డిలో ప్రోటీన్, ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్, విటమిన్-సి, విటమిన్-ఇ, మినరల్స్, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని పోషకాల లోపాలను తగ్గిస్తుంది. వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
1. మధుమేహం రోగులకు ఉపశమనం:
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని క్రమం తప్పకుండా తినాలని సూచించారు.
2. బరువు తగ్గడం:
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది.
3. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:
గోధుమ గడ్డి రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా.. ఇది గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినట్లయితే వాళ్లకి ఈ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది.
4. శరీరంలోని టాక్సిన్స్ పై ప్రభావం చూపుతుంది:
గోధుమ గడ్డి రసంలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిండంలో కృషి చేస్తుంది. దీంతో జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Pink Himalayan Salt: పింక్ సాల్ట్ వాడుతున్నారా..దాని ప్రయోజనాలు తెలుసుకోండి.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook