Stones in Body: మీరిప్పటి వరకూ కిడ్నీలో మాత్రమే రాళ్లుంటాయని వినుంటారు. కిడ్నీతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయి. నొప్పిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో గుండెతో పాటు అత్యంత ముఖ్యమైన భాగం కిడ్నీలు. కిడ్నీ విషయంలో ఎక్కువగా వచ్చే సమస్య కిడ్నీలో రాళ్లు. సాధారణంగా శరీరంలోని కిడ్నీలో మాత్రమే రాళ్లు ఏర్పడతాయని అందరూ భావిస్తుంటారు. అందరికీ తెలిసింది కూడా అదే. అయితే కిడ్నీతో పాటు శరీరంలోని ఇతర అంగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయని చాలామందికి తెలియదు. ఇవాళ మేం వివరించేది దాని గురించే. కిడ్నీ కాకుండా శరీరంలోని ఏయే భాగాల్లో రాళ్లుండే అవకాశాలున్నాయి..ఏం చేయాలనేది తెలుసుకుందాం..


శరీరంలోని ఏ ప్రాంతంలో రాళ్లుంటాయి


కిడ్నీలో రాళ్ల సమస్య సర్వ సాధారణమే కాకుండా చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అధిక బరువు, మందులు ఎక్కువగా వాడటం, ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు. దీనివల్ల ఆ వ్యక్తి భరించలేని నొప్పుల్ని సహించాల్సి వస్తుంది. అయితే కిడ్నీలోనే కాకుండా..శరీరంలోని ఇతర భాగాల్లో కూడా రాళ్లుంటాయి. ఆ వివరాలు మీ కోసం..


1. పిత్తాశయం సంచిలో కూడా రాళ్లుంటాయి. పిత్తాశయం సంచి అనేది లివర్‌కు సరిగ్గా దిగువన కుడివైపుంటుంది. పిత్తాశయం నాళికలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. పిత్తాశయం సంచిలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు అది రాయి రూపంలో మారుతుంది. అలా ఉన్నప్పుడు భయంకరమైన నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుుడు సహజంగా సర్జరీ తప్పదు. పిత్తాశయం చుట్టుపక్కల నొప్పి, ఛాతీలో మంట, కడుపులో బరువుగా ఉండటం, అజీర్ణం, పుల్లటి తేన్పులు ప్రధాన లక్షణాలు


2. మూత్రాశయంలో కూడా రాళ్లుంటాయి. శరీరంలోని మినరల్స్ కఠినంగా మారినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో నొప్పి అధికంగా ఉంటుంది. ఫలితంగా వ్యక్తి మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవదు. దాంతో మూత్రం వెంటవెంటనే రావడం, మూత్రం పోసేటప్పుడు ఇబ్బంది కలగడం, మూత్రంలో రక్తం కారడం, నొప్పి వంటివి ప్రధాన లక్షణాలు.


Also read: Viral Fever: మీ పిల్లలకు తరచుగా వైరల్ ఫీవర్ వస్తుందా.. అయితే ఇలా చేయండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook