How To Blacken Hair Naturally: ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో జుట్టు నెరిసిపోతోంది. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటి కారణం ఆహారలోపమైతే, రెండో కారణం టెన్షన్‌. 25 నుంచి 30 సంవత్సరాల వయస్సులో మొదటిసారి తెల్ల జుట్టు కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం హెయిర్ డై, ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదంటున్నారు. వంటగదిలో ఉండే వస్తువుల ద్వారా సహజంగా తెల్ల జుట్టును నల్ల రంగులోకి మార్చుకోవచ్చంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న వయసులో తెల్లజుట్టు రావడానికి కారణాలేంటి..?


ఇటివల కాలంలో తెల్ల జుట్టు వస్తుందని చాలా మంది యువకులు బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ తెల్ల జుట్టుకు దారి తీస్తున్నాయి. అదే కాకుండా పని ఒత్తిడి,  హార్మోన్ల మార్పులు కూడా దీనికి ప్రధాన కారణాలవుతున్నాయి. అయితే ఈ సమస్యను సకాలంలో అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.



జుట్టు నల్లగా మారాలంటే ఈ 3 విషయాలను తప్పకుండా పాటించండి:


1. మెంతి గింజలు:


హెల్తీ, స్ట్రాంగ్, డార్క్ హెయిర్ కోసం.. ఖచ్చితంగా మెంతి గింజలను ఉపయోగించడం వల్ల మంచి దృడమైన జుట్టును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి. ఇందుకోసం మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి తర్వాత వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోని కొబ్బరి లేదా బాదం నూనెతో కలిపి జుట్టుకు పట్టించాలి.


2. మెహందీ(మైదాకు):


జుట్టును నల్లగా మార్చుకోవడానికి కెమికల్‌తో కూడిన హెయిర్ షాంపులు గాని రంగులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది మిగిత జుట్టుకు హాని కలిగిస్తుంది. అయితే నల్ల జుట్టు కోసం హెన్నాను ఉపయోగించవచ్చు. ఇది సహజ సిద్దమైన మిశ్రమం కనుక వెంట్రుకలకు ఎలాంటి హాని కలించదు.


3. ఉసిరికాయ:


ఉసిరికాయ జుట్టును నల్లగా చేయడమే కాకుండా.. దానిని చాలా బలంగా చేస్తుంది. ఉసిరికాయను 2 రకాలుగా ఉపయోగించవచ్చు. దీని పొడిని హెన్నాతో కలపి జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా మారుతాయి.


 


Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా


Also Read: NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hyh4G



Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.