Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

Acharya: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కనబెడితే  ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిరు, చెక్రీలకు కూడా దక్కని అరుదైన గౌరవమది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2022, 03:16 PM IST
  • సోనూసూద్‌పై విపరీతమైన క్రేజ్
  • ఆచార్య సినిమా స్క్రీన్‌పై సోనూసూద్‌ను చూడగానే అభిమానుల ఆనందం
  • ధియేటర్ స్క్రీన్లపై నోట్ల వర్షంతో సందడి
Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

Acharya: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కనబెడితే  ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిరు, చెక్రీలకు కూడా దక్కని అరుదైన గౌరవమది.

కరోనా మహమ్మారి కారణంగా పేదలకు, ఆపన్నులకు మద్దతుగా నిలవడంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అంటే అభిమానం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. రీల్ హీరో కాదు..రియల్ హీరో అన్పించుకున్నాడు. ఆ హీరోను మరోసారి స్క్రీన్‌పై చూడగానే అభిమానుల్లో ఆనందం పెరిగిపోయింది. ఆనందంతో ఆ అభిమానులు చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమాలో సోనూసూద్‌ను వెండితెరపై చూడగానే..అబిమానులు వెర్రెత్తిపోయారు. థియేటర్‌లో నోట్ల వర్షం కురిపించారు. 

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన సినిమా ఆచార్యలో సోనూసూద్..అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. అభిమానులపై అభిమానం వ్యక్తం చేస్తూ సోనూ‌సూద్ ఓ వీడియో షేర్ చేశాడు. తాను ఇంతటి అభిమానానికి అర్హుడిని కానని చెప్పుకున్నాడు. వీడియో ఓ ధియేటర్‌లో తీసింది. ఆచార్య సినిమాలో వెండితెరపై సోనూసూద్ కన్పించగానే ఆనందం తట్టుకోలేక నోట్ల వర్షం కురిపించేశారు. నోట్లతో స్క్రీన్ మొత్తం నిండిపోయినట్టు కన్పించింది. సోనూసూద్‌పై ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

ఇదే వీడియోలో ఆచార్య సినిమా విడుదలైన ఓ థియేటర్ ప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేసిన సోనూసూద్ కటౌట్ ముందు కొంతమంది డప్పు వాయించడం చూడవచ్చు. సోనూ కటౌట్‌కు భారీ గజమాల వేసి గౌరవించారు. అంతేకాదు కటౌట్‌లో సోనూసూద్ నుదుట తిలకం దిద్దారు. కటౌట్‌కు పాలాబిషేకం చేశారు. బాణాసంచా కాల్చి కటౌట్‌కు హారతి కూడా ఇచ్చారు.

ఈ వీడియో చూసిన సోనూసూద్ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియాపై ఇదే వీడియోను షేర్ చేస్తూ..మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు, మీరు నా కుటుంబసభ్యులని గర్వంగా చెప్పుకుంటాను, అయితే ఇంతటి అభిమానానికి నేను అర్హుడిని కాను, కానీ మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞుడిని మరింతగా నన్ను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణ ఇది అని రాశాడు.

Also read: Casting Couch: మళయాల నిర్మాత విజయ్ బాబు భాగోతం, వైరల్ అవుతున్న ఆ మహిళ పోస్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News