Home Remedies for White Hair: ఈరోజుల్లో చిన్న వయసులోనే చాలామంది యువతకు జుట్టు నెరిసిపోతోంది. 20 ఏళ్ల వయసులోనే హెయిర్ కలర్ వేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మార్కెట్‌లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లోనే నేచురల్‌ పద్దతిలో కొన్ని మిశ్రమాలను తయారుచేసుకోవచ్చు. వాటిని తెల్లజుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) కరివేపాకులతో :


మూడు రెమ్మల కరివేపాకు తీసుకుని 2 టీస్పూన్ల ఆమ్లా పౌడర్‌, 2 టీస్పూన్ల బ్రహ్మీ పౌడర్‌తో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్‌కి అప్లై చేసి ఒక గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత హెర్బల్ షాంపూతో కడిగేసుకోవాలి. 


2) కొబ్బరి నూనె :


ఒక చిన్నపాటి గిన్నెలో కొద్దిగా కొబ్బరినూనె, నిమ్మకాయ రసం వేసి రెండింటినీ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు పట్టించాలి. కొబ్బరినూనె, నిమ్మకాయలో ఉండే ఔషధ గుణాలు జుట్టు నల్లబడేలా చేస్తాయి.


3) ఆమ్లా పౌడర్ :


ఒక గిన్నెలో ఒక కప్పు ఆమ్లా పౌడర్ తీసుకుని అది బూడిదయ్యేంతవరకూ వేడి చేయాలి. అందులో 500 మి.లీ కొబ్బరినూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని 20 ని. పాటు సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి. మిశ్రమాన్ని చల్లార్చి 24 గంటల తర్వాత గాలి బయటకు వెళ్లని బాటిల్‌లో భద్రపరచాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేయాలి. 


ఈ మూడు చిట్కాలను రెగ్యులర్‌గా పాటించడం ద్వారా తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు, ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్నవారు ఈ చిట్కాలతో మంచి ఫలితాలు పొందవచ్చు.


(గమనిక : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దాన్ని ధ్రువీకరించలేదు.)


Also Read: India vs West Indies: టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్..వీడియో వైరల్..!


Also Read: Viral Video: రైల్వే స్టేషన్‌లో.. అందరూ చూస్తుండగా.. వృద్ధుడిని వేలాడదీసి దాడి చేసిన కానిస్టేబుల్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook