Viral Video: రైల్వే స్టేషన్‌లో.. అందరూ చూస్తుండగా.. వృద్ధుడిని వేలాడదీసి దాడి చేసిన కానిస్టేబుల్..

Viral Video of Cop Attacks Elderly Man: జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 30, 2022, 02:52 PM IST
  • జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన
  • వృద్ధుడిపై కానిస్టేబుల్ దాడి
  • ప్లాట్‌ఫామ్ అంచున వేలాడదీసి దాడి చేసిన కానిస్టేబుల్
Viral Video: రైల్వే స్టేషన్‌లో.. అందరూ చూస్తుండగా.. వృద్ధుడిని వేలాడదీసి దాడి చేసిన కానిస్టేబుల్..

Viral Video of Cop Attacks Elderly Man: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోట చేసుకుంది. ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఓ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతన్ని కిందపడేసి బూటు కాలితో ముఖంపై, కడుపులో తన్నాడు. అతను పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నకొద్ది తన్నుతూనే ఉన్నాడు. అక్కడితో ఆగక.. ఆ వృద్ధుడి రెండు కాళ్లు పట్టి ప్లాట్‌ఫామ్‌ చివరి అంచు వరకు లాక్కెళ్లాడు. అక్కడ అతన్ని తల కిందకు కాళ్లు పైకి పెట్టి వేలాడదీసి మళ్లీ తన్నడం మొదలుపెట్టాడు.

ఓ రైల్వే ప్రయాణికుడు ఆ కానిస్టేబుల్ దాడిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్ వృద్ధుడిని అంతలా కొడుతుంటే ఒక్కరూ ఆపకపోవడం గమనార్హం. బుధవారం (జూలై 27) నాడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ అతనిపై ఎందుకు దాడి చేశాడనేది మాత్రం తెలియలేదు.

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్న ప్యాసింజర్స్‌తో ఆ వృద్ధుడు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడని.. అందుకే కానిస్టేబుల్ అతన్ని చితకబాదాడని కొందరు చెబుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లలో కొందరు ఆ వృద్ధుడిపై సానుభూతి వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అసలు విషయం తెలియకుండా కానిస్టేబుల్‌ను తప్పు పడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: Flipkart Bumper Offers: స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బ్రాండ్స్‌ ఇప్పుడు సగం కన్నా తక్కువ ధరకే..

Also Read: Komatireddy Rajagopal Reddy: కేసీఆర్ కుటుంబంపైనే యుద్ధం:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 

Trending News