White Hair To Black Hair Solution: ఆధునిక  జీవనశైలి కారణంగా చాలా తెల్ల జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకుతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా మారుతుంది. కాబట్టి ఈ కరివేపాకు హెయిర్‌ మాస్క్‌ను ఎలా వినియోగించాలో ఇప్పడు తెలుసుకుందాం..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెరిసిన జుట్టు కోసం కరివేపాకును వినియోగించాల్సి ఉంటుంది:
కరివేపాకులో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మెలమైన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ తెల్లబడకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కరివేపాకు హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.


కరివేపాకు, కొబ్బరి నూనె:
కరివేపాకు, కొబ్బరి నూనెతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని కోసం..12 నుంచి 14 కరివేపాకులను వేసి సుమారు 20 నిమిషాలు నూనెలో ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఈ నూనెను చల్లార్చి ఒక డబ్బాలో పోసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన నూనెను జుట్టుకు వారానికి ఒకటి నుంచి రెండు సార్లు వినియోగిస్తే సులభంగా జుట్టు నల్లగా మారుతుంది.


కరివేపాకు ఆకల పేస్ట్:
కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల సులభంగా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 25 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


కరివేపాకు, పెరుగు:
అర గిన్నె పెరుగులో కరివేపా మిశ్రమాన్ని కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఫ్యాన్‌ను వారానికి మూడు నుంచి రెండు రోజుల పాటు వినియోగించాల్సి ఉంటుంది.


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook