White Hair Treatment: చింతపండు రుచిని ఆస్వాదించని వారు ఉండరు. ఈ పుల్లని రుచికరమైన చింతపండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండుతో విముక్తి పొందవచ్చని వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టంగా మారింది. దీని కారణంగా జుట్టు రాలడం వంటి సమస్యలు అధికంగా పెరిగాయి. జుట్టు, చర్మం సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో చింత పండును ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
జుట్టు నల్లగా మారుతుంది:


మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం తర్వాత బట్టతలగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో చింతపండు మంచి ఔషధంగా పని చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ఆహారంలో తినడం వల్ల జుట్టు దృఢంగా ఉండడమే కాకుండా నిగనిగలాడుతుంది.


ముఖం మెరుగుపరుస్తుంది:


చింతపండు ఆహారంలో తీసుకోవడం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. తద్వారా చర్మానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.


 బరువును కూడా తగ్గిస్తుంది:


చింతపండులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


కాలేయానికి కూడా మేలు చేస్తుంది:


కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే..తప్పకుండా చింతపండు తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోసైనిడిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాలేయాన్ని రక్షించడానికి కృషి చేస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Clove Beneficial for Diabetes: లవంగాలు ఎక్కువగా వాడుతున్నారా..ఈ ప్రయోజనాలు తప్పకుండా పొందుతారు..!!


Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook