Monkeypox: కొవిడ్ మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాకముందే పుట్టుకొచ్చిన మరో వైరస్ మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో 7 వందలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్ లో ఒక్కరోజే 50కి పైగా కొత్త మంకీపాక్స్ కేసులు వచ్చాయి. ఆ దేశంలో మొత్తంకేసుల సంఖ్య వంద దాటింది. అయితే హాస్పిటల్ లో చేరిన వారు మాత్రమే ఒక్కరే. ఫ్రాన్స్ దేశంలో ఇప్పటివరకు మంకీపాక్స్ సోకిన వారిలో ఒక్కరే మగవారు. భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. యూపీలో ఐదేళ్ల చిన్నారికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. పాప బాడీపై దద్దర్లు, బొబ్బలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. చిన్నారి నమూనాలు ల్యాబ్ కి పంపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యాధి రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని తెలిపింది. వ్యాధి గుర్తింపు, కట్టడి, నివారణపై ఐదు కీలక సూచనలు చేసింది డబ్లూహెచ్వో.  అసలు మంకీపాక్స్ అంటే ఏంటి? ఎలా వస్తుంది... ఎలా వ్యాపిస్తుంది.. నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగానే ప్రజలకు  అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని డబ్ల్యూహెచ్‌వో అధికారిణి మరియా వాన్ కెర్‌ఖోవ్ చెప్పారు. మంకీపాక్స్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని, ఇది సోకిన వారితో ఇతరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏమాత్రం అజాగ్తత్తగా ఉన్నా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని WHO వెల్లడించింది. వైరస్ ను ముందుగానే గుర్తిస్తే కట్టడి చేయడం ఈజీగా ఉంటుందని.. అనుమానితులతో పాటు రోగి కాంటాక్ట్ ను వెంటనే ఐసోలేట్ చేస్తే వ్యాధి విస్తరించకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపింది.


మంకీపాక్స్ రోగికి చికిత్స అందించే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు రక్షణ కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. రోగుల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకునేవారు.. టెస్టులు నిర్వహించేవారు.. రోగికి చికిత్స చేసేవాళ్లు.. ముందుగా ఈ వైరస్ పై పూర్తి అవగాహన కల్గి ఉండాలని.. కావాల్సిన అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. వైరస్ నివారణ చర్యల కోసం అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను పాటించాలని వెల్లడించింది. మంకీపాక్స్ నివారణలో ఉపయోగపడే  యాంటీవైరల్స్‌, వ్యాక్సిన్లను వాడటంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ పై సమగ్ర సమాచారం సేకరించి.. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఆరోగ్య సంస్థ చెప్పింది. మంకీపాక్స్ పై సమగ్ర సమాచారం తెలిపేందుకు త్వరలోనే అంటువ్యాధులకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణులు, పరిశోధన సంస్థలతో సమావేశం నిర్వహిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మంకీపాక్స్ పై పరిశోధనలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.


READ ALSO: Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!


READ ALSO:  Salman Khan: బాలీవుడ్‌లో కలకలం..సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook