Covaxin: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించి కీలకమైన భేటీ త్వరలో జరగనుంది. కోవాగ్జిన్‌కు అంతర్జాతీయ అనుమతి జారీ కానుందా లేదా అనేది ఈ భేటీలో తేలనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ (India Vaccination)ప్రక్రియలో ఈ మూడు వ్యాక్సిన్లే భాగం పంచుకుంటున్నాయి. ముఖ్యంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఇందులో కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు అంతర్జాతీయ అనుమతి ఉంది. ఫలితంగా ఈ రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నవారికి విదేశీ ప్రయాణాలకు అనుమతి ఉంటుంది. అయితే కోవిషీల్డ్ తరువాత దేశంలోనూ, కొన్ని ఇతర దేశాల్లోనూ అత్యధికంగా కోవాగ్జిన్ అందుబాటులో ఉంది. కానీ కోవాగ్జిన్ అంతర్జాతీయంగా అనుమతి పొందిన వ్యాక్సిన్ల జాబితాలో లేకపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇబ్బంది ఏర్పడుతోంది. అందుకే కోవాగ్జిన్ అనుమతి విషయంలో ఇండియా..ప్రపంచ ఆరోగ్యసంస్థపై(WHO)ఒత్తిడి తెస్తోంది.


ఇందులో భాగంగానే కోవాగ్జిన్(Covaxin) వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులిచ్చే అంశంపై చర్చించేందుకు కీలకమైన భేటీ ఏర్పాటు కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాటెజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ ఆన్ ఇమ్యునైజేషన్ భేటీ అక్టోబర్ 6న జరగనుంది(WHO Experts Committee Meet On Covaxin). ఈ భేటీలో కోవాగ్జిన్ విషయం చర్చకు రానుంది. ఈ భేటీలో భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు..వ్యాక్సిన్ సమర్ధత, సురక్షితత్వం, క్లినికల్ ట్రయల్స్ వివరాలపై ప్రజంటేషనా్ ఇవ్వనున్నారు. క్లినికల్ ట్రయల్స్ 1,2,3 లలో వచ్చిన ఫలితాల్ని బట్టి వ్యాక్సిన్ ఏ మేరకు రోగ నిరోధక శక్తిని(Immunity Power)ఇవ్వగలుగుతుందో అంచనాకు వస్తారు. ఈ అంచనా ఆధారంగా వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ అనుమతి జారీ చేయనున్నారు.


Also read: Heavy Rains Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook