Holi 2024: భాంగ్ మన సంప్రదాయ పానియం. దీనికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హోలీ అంటే భాంగ్.. భాంగ్ అంటే హోలీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు భాంగ్ తాగే సంప్రదాయం ఉంది. అయితే, హోలీ నాడు భంగ్ తాగి రంగులు పూసుకునే సంప్రదాయం ఉంది. అయితే, ఇది సంప్రదాయంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హోలీ కొంతమేర పాలలో కలుపుకోని తయారు చేసుకుని తాగే సంప్రదాయం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భాంగ్ మన మతపర వేడుకల్లో తయారు చేసుకుంటాం. ఇది మన హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన పురాతన కాలం నుంచి హోలీ నాడు భాంగ్ తాగే సంప్రదాయం ఉంది. మన హిందూ వేడుకల్లో భంగ్ కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ భాంగ్ మోతాదుకు మించి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఇది గంజాయి మొక్క ఆకులు, పూవులతో తయారు చేసుకుంటారు. అయితే, హోలీ నాడే భాంగ్ ఎందుకు తాగుతారో మీకు తెలుసా?


మెదడుపై భాంగ్ ఎఫెక్ట్ క్రమేణా కనిపిస్తుంది. ఇందులో మెడిసినల్ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా మన పురాణాల ప్రకారం భాంగ్ శివుడికి ఎంతో ఇష్టమైన పానియంగా నమ్ముతారు. హోలీనాడు శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించే ఆచారం ఉంది. సాధారణంగా భాంగ్ అంటే గంజాయి. వీటిని పండిచడం చట్టరీత్యా నేరం కానీ, ఇది క్షీరసాగర మథనంలో బయటపడిందని నమ్ముతారు. 


జీర్ణక్రియ..
జీర్ణక్రియను మెరుగుపరచడంలో భాంగ్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, కడుపు పుబ్బరం, మలమద్ధకం సమస్యకు కూడా చెక్ పెడుతుంది.


ఒత్తిడి..
భాంగ్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు భాంగ్ మనకు మంచి నిద్రకు ఉపక్రమించేలా పనిచేస్తుంది.


ఇదీ చదవండి: మధుమేహం ఉన్నవారు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఒక్క పనిచేయండి..


నొప్పి..
భాంగ్లో ముక్యంగా యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణం వీటికి ఉంటుంది.


ఇమ్యూనిటీ..
భాంగ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 


ఇదీ చదవండి:  రాస్బెరీలతో కలిగే ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..


రెస్పిరేటరీ హెల్త్..
భాంగ్ లో బ్రాన్‌కాడిలేటర్ లక్షణాలు ఉంటాయి. ఇది రెస్పిరేటరీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వ్యక్తి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది భంగ్‌ తీసుకోవడం వల్ల యూఫోరియా, రిలాక్సేషన్ అనుభవిస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి