నేటి సాంకేతిక కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని నిమిషాలు ఫోన్ కనిపింకపోతే చాలు కంగారు పడుతున్నారు, ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అయితే చాలా మంది బాత్రూమ్(Toilet)కు వెళ్తూ తమ వెంట మొబైల్స్ తీసుకుంటారు. దాని ద్వారా ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయని తెలుసా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం ప్రాణాంతకం
మొబైల్ ఫోన్‌తో బాత్రూమ్‌కు తీసుకెళ్లే అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. మీరు లేక మీ కుటుంబసభ్యులు టాయిలెట్ నుంచి ప్రమాదకర బ్యాక్టీరియాను ఇంట్లోకి తెస్తారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అసలే కరోనా వైరస్(CoronaVirus) లాంటి వ్యాధులు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి.



పైల్స్ సమస్య..
గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే పైల్స్ సమస్య ఇప్పుడు యువతలో కూడా సాధారణమైంది. పైల్స్(Piles) సమస్య కారణంగా మీ మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం చేస్తుంటారు. అయితే మీరు మొబైల్‌తో బాత్రూమ్‌లో కూర్చున్నప్పుడు, ఫోన్‌పైన మీ పూర్తి శ్రద్ధఉంటుంది. ఈ కారణంగా మీరు సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల హేమోరాయిడ్స్(Haemorrhoids) అంటే పైల్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.


Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం


 


కండరాలపై ఒత్తిడి..
చాలా మంది టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదువుతారు, మొబైల్‌లో వార్తలు, సోషల్ మీడియా సైట్లు చూస్తారు, వీడియోలు చూస్తారు లేదా చాటింగ్ చేస్తుంటారు. దీని వల్ల వారికి సమయం కూడా తెలియదు. ఎక్కువసేపు కూర్చుని ఉంటే పాయువు మరియు పురీషనాళం(Lower Rectum) యొక్క కండరాల నరాలపై ఒత్తిడి పెంచుతుంది. ఇది పైల్స్ సమస్యకు ఓ కారణం అవుతుంది.


Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!


 


బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది..
బాత్రూమ్ లాంటి ప్రదేశాలలో కచ్చితంగా ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మీరు టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది. మీరు చేతులు శుభ్రం చేసుకుంటారు. కానీ మొబైల్‌ను కడగరు కనుక అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకావం ఉంది.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook