Healthy Drink: చలి కాలంలో తప్ప తాగాల్సిన హెల్తీ డ్రింక్..ఇలా బరువు తగ్గించుకోండి!
Winter Healthy Drinks: శీతాకాలంలో పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.
Winter Healthy Drinks: శీతాకాలంలో చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో తేమ పరిణామాలు ఒక్కసారిగా పెరిగిపోయి. జలుబు, మైగ్రేన్, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తీవ్ర వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఉబ్బరం, ఆమ్లత్వం, బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. శీతాకాలంలో తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన డ్రింక్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
శీతాకాలంతో ఆయుర్వేద గుణాలు కలిగిన డ్రింక్స్ శరీరానికి చాలా సహాయపడతాయి. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఆయుర్వేద నిపుణులు సూచించి డ్రింక్స్ ప్రభావంతంగా సహాయపడతాయి. అయితే చలి కాలంలో ఏయే డ్రింక్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు డ్రింక్‌కి కావాల్సిన పదార్థాలు:
2 గ్లాసుల నీరు
7 నుంచి 10 కరివేపాకు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలు
1 టీస్పూన్ జీలకర్ర
1 చిటికెడు ఏలకులు చూర్ణం
తురిమిన అల్లం
డ్రింక్ తయారి పద్ధతి:
ముందుగా పాన్‌లో నీటిని పోసుకోవాలి.
ఆ నీటిని బాగా ఉడికించుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర గింజలు, జీలకర్ర, యాలకులు చూర్ణం వేసుకోవాల్సి ఉంటుంది.
వీటిని వేసుకున్న తర్వాత అల్లం వేసుకుని కనీసం 5 నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత డ్రింక్‌ను వడపోసుకుని సర్వ్ చేసుకోవాలి.
కరివేపాకు డ్రింక్ వల్ల కలిగే లాభాలు:
ఈ డింక్‌లో ఉండే గుణాలు శీతాకాలం కారణంగా వచ్చే జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ముఖ్యంగా శరీర బరువును తగ్గించడమే కాకుండా..రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
శీతాకాలంలో చాలా మంది స్త్రీలలో ఐరన్ లోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ డ్రింక్‌లో ఉండే గుణాలు హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతాయి.
కరివేపాకు డ్రింక్‌లో ఉండే గుణాలు ఉబ్బరం, అజీర్ణం, జలుబు, మధుమేహం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ డ్రింక్‌లో కొత్తిమీర గింజలు కూడా వినియోగిస్తారు. కాబట్టి సులభంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మైగ్రేన్, థైరాయిడ్, హార్మోన్ల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
ఈ డ్రింక్‌లో ఉండే గుణాలు అధిక రక్తపోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి