Papaya Benefits During Periods: నెలసరి సమయంలో కొన్ని రకాల పండ్లు హాని కల్గిస్తాయంటారు. బొప్పాయి విషయంలో చాలామంది మహిళలకు కొన్ని సందేహాలున్నాయి. నెలసరి సమయంలో బొప్పాయి ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలకు పీరియడ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది నొప్పి. దాంతో పాటు అసహజత్వం, మూడ్ స్వింగ్ కావడం ఇలా వేర్వేరు సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకలి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు ఏం తినాలన్పించదు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల పదార్ధాలు తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఎలాంటి డైట్ అవసరమో పరిశీలిద్దాం. పీరియడ్స్ సమయంలో కొన్ని పండ్లు నొప్పి నుంచి ఉపశమనం  కల్గిస్తాయి. కొన్ని అదే నొప్పిని పెంచుతాయి. అందుకే ఏది తినకూడదు, ఏది తినాలో తెలుసుకోవాలి. బొప్పాయి విషయంలో నెలసరిలో ఉన్న మహిళలకు ఎప్పుడూ ఓ సందిగ్దత ఉంటుంది. బొప్పాయి మంచిదో కాదో తేల్చుకోలేకపోతుంటారు.


నిపుణుల సూచనల ప్రకారం గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం మంచిదే. కానీ పచ్చి బొప్పాయి అస్సలు తినకూడదు.  వాస్తవానికి పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పపైన్ అధికంగా ఉంటుంది. ఇవి గర్భాశయం సంకోచనాన్ని ప్రేరేపిత చేసి తీవ్రమైన ఎలర్జీ, త్వరగా పురిటి నొప్పులు వచ్చేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో కూడా బొప్పాయి తినడంలో అప్రమత్తంగా ఉండాలి.


పీరియడ్స్ సమయంలో బొప్పాయి తింటే ఏమౌతుంది


1. రక్త సరఫరాలో మెరుగుదల


బొప్పాయి గర్భాశయ కండరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు బొప్పాయిలోని కేటరీన్ నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. 


2. పీరియడ్స్ సైకిల్ రెగ్యులరైజేషన్


నియమిత మోతాదులో రోజూ బొప్పాయి తినడం వల్ల గర్భాశయం మాంస కండరాలు దోహదమౌతుంది. సరీరంలో వేడి పుట్టించడంతో పాటు ఇందులో కేటరీన్ కూడా అధికంగా ఉంటుంది. బొప్పాయి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది.


Also Read: Weak Bones Signs: ఈ 5 లక్షణాలు కన్పిస్తే మీ ఎముకల్లో సత్తువ పోయినట్టే


Also Read: Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook