Padma Awards 2023: గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్ వైరల్

MM Keeravani Receives Padma Award ఎంఎం కీరవాణి తాజాగా పద్మ అవార్డును అందుకున్నాడు. జనవరిలో ప్రకటించిన ఈ పద్మ అవార్డులను కేంద్రం నిన్న ప్రదానం చేసింది. ఇందులో భాగంగా కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 11:03 AM IST
  • పద్మ అవార్డులను ప్రదానం చేసిన కేంద్రం
  • పద్మ అవార్డును అందుకున్న ఎంఎం కీరవాణి
  • గర్వంగా ఉందన్న దర్శకధీరుడు రాజమౌళి
Padma Awards 2023: గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్ వైరల్

MM Keeravani Receives Padma Award 2023: ఎంఎం కీరవాణికి తాజాగా పద్మ శ్రీ అవార్డును అందుకున్నాడు. కీరవాణికి ఇలా పద్మ అవార్డు ప్రదానం చేయడంతో రాజమౌళి స్పందించాడు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ట్వీట్ వేశాడు. దీంతో ఇలా ఇద్దరూ పద్మ అవార్డు గ్రహీతలు ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాటతో అంతర్జాతీయంగా కీరవాణికి వచ్చిన గుర్తింపు అందరికీ తెలిసిందే. ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకుని ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త చాప్టర్‌ను క్రియేట్ చేశాడు కీరవాణి.

కీరవాణిని చూసి రాజమౌళి మురిసిపోతోన్నాడు. తన పెద్దన్నకు పద్మ అవార్డ్ రావడంతో ఇలా స్పందించాడు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరూ పద్మ అవార్డు గ్రహీతలున్నారంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. ఇక రాజమౌళి కీరవాణి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రాజమౌళి సినిమా అంటే.. కీరవాణి ఉండాల్సిందే. ఇంత వరకు కీరవాణి లేకుండా రాజమౌళి సినిమా చేయలేదు. రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ ఇలా అంతా కలిసి సినిమాకు పని చేస్తుంటారు. సమష్టిగా వారు కృషి చేస్తారు కాబట్టే వారి సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వవు. ఇక రమా రాజమౌలి క్యాస్టూమ్స్, కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ, రాజమౌళి టేకింగ్ అన్నీ కలిసి సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్తాయి.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

రవీనా టాండన్, సుధా మూర్తికి కూడా పద్మ అవార్డులు వచ్చాయి. నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్రం ఈ అవార్డులను బహూకరించింది. పద్మ అవార్డుల విషయంలో ఎప్పుడూ ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులున్నా కూడా ఇంత వరకు వారిని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.. అవార్డులు ఇవ్వలేదని ఓ వర్గం మండిపడుతూనే ఉంటుంది.

Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News