Women Health Care Tips: కిడ్నీ సమస్యలు మహిళల్లోనే ఎందుకెక్కువ, కారణాలేంటి
Women Health Care Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీలు. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోతే ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే కావచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Women Health Care Tips: ఇటీవలి కాలంలో కిడ్నీ వ్యాధి సమస్య అధికమైంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇది ప్రమాదకర సంకేతం. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
కిడ్నీ సమస్య అనేది ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటోంది. పలు అధ్యయనాల్లో ఇదే వెల్లడైంది. కిడ్నీ వ్యాధులు ఎక్కువగా మహిళలకే వస్తాయని. దీనికి కారణం లేకపోలేదు. సాధారణంగా మహిళలకు తమకొచ్చే సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కిడ్నీ వ్యాధి అనేది పురుషులకు కూడా వస్తుంటుంది కానీ కొన్ని ప్రత్యేక కిడ్నీ సంబంధిత సమస్యలు మాత్రం కేవలం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంటాయి. అసలు కిడ్నీ సమస్యలు మహిళల్లో ఎందుకు ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం..
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు కిడ్నీ సంబంధిత సమస్యలు రావచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో మహిళల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే గర్భధారణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
మహిళల్లో పీసీఓఎస్ సమస్య అనేది సర్వ సాధారణం. అయితే ఈ సమస్య తరచూ ఉంటే అది కిడ్నీ వ్యాధికి దారితీయవచ్చు. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ప్రతి భోజనం మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. వాకింగ్, వ్యాయామం, యోగా ఇలా ఫిజికల్ యాక్టివిటీకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళల్లో ఎక్కువగా యూటీఐ సమస్య వస్తుంటుంది. అంటే యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్య. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే కిడ్నీ సమస్యకు దారీ తీయవచ్చు. పురుషులతో పోలిస్తే యూటీ ఇన్‌ఫెక్షన్ సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుంది. అందుకే యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
ఇక మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది మంచిది కాదు. ఒత్తిడికి లోనవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళనలో ఉండే మహిళలకు కిడ్నీ రాళ్ల సమస్య ఉంటుంది. మరోవైపు డయాబెటిస్ కూడా కిడ్నీ సమస్యలకు కారణమౌతుంది. ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పీక్స్ వెళ్లిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీలకు హాని కలుగుతుంది. ఈ సమస్య నుంచి కాపాడుకోవాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి.
Also read: Cholesterol Signs: శరీరంలోని ఈ మూడు భాగాల్లో నొప్పి తీవ్రంగా ఉంటోందా, అయితే కొలెస్ట్రాల్ ఉందని అర్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook