Women Diet: పురుషులతో పోలిస్తే మహిళలకు 40 ఏళ్లు దాటితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఒక్కోసారి గంభీరమైన వ్యాధులు కూడా ఉత్పన్నమౌతుంటాయి. అందుకే ఈ సమయంలో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారనేది కీలకంగా మారుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా మహిళలు 40 ఏళ్లు దాటితే ప్రధానంగా ఎదుర్కొనేది మెనోపాజ్ సమస్య. ఈ సమయంలో వివిధ రకాల పోషకాల లోపం తలెత్తుతుంది. అందుకే ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే..40 ఏళ్లు దాటిన తరువాత చిన్న చిన్న సమస్యల్ని కూడా నిర్లక్ష్యం వహించకూడదు. సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.


1. డయాబెటిస్ సమస్య


ఇటీవలి కాలంలో యువ వయస్సులోనే డయాబెటిస్ సమస్య ప్రారంభమైపోతోంది. ప్రత్యేకించి 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే అలసట, దాహం ఎక్కువగా వేయడం, తరచూ యూరిన్ రావడం, మసక బారడం, బరువు తగ్గడం, చిగుళ్లు బలహీనం కావడం వంటి సమస్యలు మహిళల్లో కన్పిస్తే మధుమేహానికి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


2. యూరిన్ ఇన్‌ఫెక్షన్


మహిళలకు వయస్సు పెరగడంతో పాటు యూరిన్ వెళ్లేందుకు తోడ్పడే నాళికలు బలహీనమౌతుంటాయి. అంటే మూత్రాశయపు కండరాలు లావైపోతుంటాయి. పటుత్వం కోల్పోతాయి. ఫలితంగా మూత్రంపై అదుపు ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తికి దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు మూత్రం ఆపుకోలేరు.


3. ఆర్ధరైటిస్


చాలామంది మహిళలకు 40 ఏళ్లు దాటాక ఆర్ధరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కండరాలు పట్టేసినట్టుండటం వంటి సమస్యలు ప్రధానంగా కన్పిస్తాయి. సకాలంలో ఈ సమస్యకు చికిత్స చేయించకపోతే పరిస్థితి గంభీరం కావచ్చు.


అందుకే మహిళలు 40 ఏళ్ల వయస్సు దాటితే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సాధారణంగా వయస్సు పెరిగినప్పుడు బ్రెస్ట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం బ్రెస్ట్ టెస్ట్ అవసరమౌతుంది. దాంతోపాటు వయస్సు పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగడం లేదా తగ్గడం సాధారణ లక్షణం కాదు. అందుకే ఆహారంలో హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నిర్ణీత పద్దతిలో వర్కవుట్స్ చేస్తుంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. అకారణంగా బరువు పెరగడం లేదా హెయిర్ ఫాల్ సమస్య ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. డైట్‌లో ఆకుపచ్చని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా?, దోసకాయను ఇలా తినండి.. 7 రోజుల్లో ఫలితం పొందుతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook