World Hypertension Day 2023: మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
World Hypertension Day 2023: ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంప రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు.
World Hypertension Day 2023: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యలు వస్తాయి. ప్రస్తుతం రక్తపోటు సమస్యలు వృద్ధాప్య దశలో ఉన్నవారికే కాకుండా యువతలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ మందికి రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు, మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధికి సంబంధించి నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం.. భారతదేశంలో అధిక రక్తపోటుతో బాధపడేవారిలో 12% మంది మాత్రమే రక్తపోటును నియంత్రించుకోగలుగుతున్నారని పేర్కొంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
యువతలో రక్తపోటు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా?:
ఆధునిక జీవనశైలి కారణంగానే చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, జంక్-ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక రక్తపోటు సమస్యలు రాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మార్పులు తప్పనిసరి:
బరువును నియంత్రించుకోండి:
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, రక్తపోటు సమస్యలున్న వారు తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఊబకాయం సమస్యల కారణంగా రక్తపోటు సమస్యలు కూడా పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తపోటుతో పాటు తీవ్ర గుండెపోటు సమస్యలు కూడా వస్తాయి.
సోడియం గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఆహారంలో సోడియం, చక్కెర పరిమాణాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర రక్తపోటు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి సోడియం గల ఆహారాలు అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి