Yoga in Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ పద్ధతులు అనుసరిస్తారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు యోగాసానాలు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి యోగా కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు యోగా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఏయే యోగాసానాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యోగాసానాలు తప్పకుండా వేయాల్సి ఉంటుంది:
సూర్య నమస్కారాలు:

సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రోజుంతా శక్తివంతంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో సులభంగా బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  


త్రికోణాసనం:
ప్రతి రోజు త్రికోణాసనం వేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మానసిక, శారీరక సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆసనాలను వేసే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


ధనురాసనం:
ధనురాసనంతో శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఈ ఆసనాన్ని ప్రతి రోజు వేయడం వల్ల పొట్టలోని కొవ్వు సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా వెన్నును బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఈ ఆసనం చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి